ఏపీ 39టీవీ 07 ఫిబ్రవరి 2021:
కణేకల్ రాయదుర్గం తాలూకా, కణేకల్ మండలం లో తహసీల్దార్ ఉషారాణి మరియు ఎంపీడీఓ విజయభాస్కర్ ఆధ్వర్యంలో PO లు 110 మంది కి, APO లు -214 మంది కి జిల్లా పరిషత్ బాలుర ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులు నిర్వహించారు.అనంతరం ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్నికల లో పోటీచేసిన అభ్యర్థులకు నియమ నిబంధనలు,ఓటు వేయు అభ్యర్థి తన ఓటును వేయడానికి ఎటువంటి నిబంధనలు ఉండాలి, అలాగే ఎంత మంది పోలింగ్ బూత్ గది లో సిబ్బంది ఎంతమంది ఉండాలి , ఏటువంటి బాధ్యతలు నిర్వర్తించాలి , ఓటర్ కు ఉన్న సందేహాల కు ఏ విధంగా సమాధానం ఇవ్వాలి, బ్యాలెట్ బాక్స్ ను ఎవరెవరి ఆధ్వర్యంలో సీల్ చేయాలి. ఒక ఏజెంట్ గా ఉన్న వ్యక్తి ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనే అంశం పై అవగాహన ఒక రోజు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమంలో కణేకల్ మండలం తహసీల్దార్ ఉషారాణి , కణేకల్ ఎంపీడీఓ విజయభాస్కర్ మరియు తదితరులు పాల్గొన్నారు .
R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ,
రాయదుర్గం ఇన్చార్జి.