Header Top logo

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు కు కేంద్రం ఇవ్వడాన్ని అడ్డుకొంటారా లేక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా- కాంగ్రెస్ డిమాండ్

ఏపీ 39టీవీ 07 ఫిబ్రవరి 2021:

ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే ,ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రజల గళం ఒక్కసారిగా విశాఖ ఉక్కు -ఆంద్రప్రదేశ్ ప్రజల హక్కు అనే వినాదం తో 1970 లో ఏర్పాటు అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఈరోజు BJP కుట్రలకు బలియైపోయినా విషయం మనం చూస్తున్నాము.దీనిని అడ్డు కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ముక్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  సీమ పౌరుషం ఇపుడు తెలుస్తోంది. గుజరాతి కుట్రలు గెలుస్తాయా లేక సీమ పౌరుషం గెలుస్తుందా తేల్చుకోవాలి.ఆంధ్రప్రదేశ్ కు తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమ దాదాపు 22 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలను లక్షల మందికి పరోక్షంగా ఉపాధి ని అందిస్తున్న పరిశ్రమ గాను,20 వేల ఎకరాల లో దాదాపు1 లక్ష 50 వేళా కోట్ల రూపాయల విలువైన పరిశ్రమ గాను దాదాపు 8 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల పరిశ్రమ ను BJP సన్యాసులు ప్రయివేటు వ్యక్తిలకు అప్ప గించే కుట్రలను రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు నిస్తున్నది.దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థల ను కాంగ్రెస్ పార్టీ నెలకొల్పి లక్షలాది మంది కి ఉద్యోగ అవకాశాలు, కోట్ల మంది కి ఉపాధి అవకాశాలు కల్పిస్తే. ఇపుడు సన్యాసులు అధికారంలోకి వచ్చి మొత్తం ప్రభుత్వ అధీనంలో ఉన్న నవరత్న కంపెనీలను ప్రయివేటు, కార్పొరేట్ వ్యక్తుల ధారాదత్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు చాలా ప్రమాదకరమైన విగా దేశంలో ఉన్న యువత కు ఉద్యోగాలు లేకుండా చేయడం, BC, SC, ST లకు రిజర్వేషన్లు లేకుండా చేయడం BJP అజెండా గా ఉంది.ఇలాంటి చర్యలను ప్రతి రాజకీయ పార్టీ వ్యతిరేకించాలని ప్రభుత్వం ఆధీనంలో నే స్టీల్ పరిశ్రమ నడవడానికి పోరాటం చేయాలని అన్ని ప్రతిపక్ష పార్టీలకు,కార్మికుల కు,విద్యార్థులకు,కాంగ్రెస్ పార్టీ పిలుపు నిస్తున్నది. భవిష్యత్ లో జరిగే అన్ని రకాల ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుంది. అధికార వైస్సార్సీపీ పార్లమెంట్ సబ్యులు ఈ అంశంపై పార్లమెంట్ లు నిరసన తెలపాలని, TDP ఎంపీ లు కూడా రాష్ట్ర ప్రయోజనాలకు మద్దతు గా ఉద్యమం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇపుడు తన పౌరుషం నిలుపుకోవడమే ఏకైక మార్గం అని లేదా రాజీనామా ఏదో ఒకటి ఎంచుకోండి అని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది.ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పొతుల నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల వాసు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాసాల రవి,సాకే ప్రకాష్, రాప్తాడు గోవిందు,రమేష్ రెడ్డి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking