Header Top logo

ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్

AP 39TV 19 ఏప్రిల్ 2021:

తాడిపత్రి పట్టణంలో గల ఐ సి డి ఎస్ ఆఫీస్ వద్ద అంగన్వాడీల సమస్యలపై నిరసన వ్యక్తం చేసి సి డి పి ఓ శశికళ కి కేంద్ర ప్రభుత్వం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇచ్చిన ట్రాకర్ ఆప్ ఉత్తర్వులు ఉపసంహరించాలని మరియు ఇతర సమస్యల పరిష్కారం గురించి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి జ్యోతి లత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, అంగన్వాడీ కేంద్రాలకు ఆహారధాన్యాలు, నిధులు కార్మికుల వేతనాలు పోషణ్ ట్రాకర్ ఆప్ కి అనుసంధానం చేయాలని నిర్ణయించడం చట్టవిరుద్ధం. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ పోషణ ట్రాక్టర్ తో అనేక ఇబ్బందులు పడుతున్నారు. నెట్ సౌకర్యం ఉంటేనే ఆన్లైన్ పనులు అవుతున్నాయి. మారుమూల గ్రామాల్లో గిరిజన ప్రాంతాల్లో నేటికీ నెట్ సౌకర్యం లేదు. గతంలో ఇచ్చిన మొబైల్ ఫోన్లు పనిచేయడం లేదు. పోషణ్ ట్రాకర్ యాప్ పూర్తిగా ఇంగ్లీషులో ఉంది. ఇప్పటికీ ఎటువంటి శిక్షణ కూడా ఇవ్వలేదు. పోషణ్ ట్రాకర్ యాప్ తో కార్మికుల జీవితాలు పౌష్టికాహార పంపిణీ నిధులు అనుసంధానం చేయవద్దని కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు కోత పెడుతున్నది. నిత్యావసర సరుకుల ధరలు గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనివలన సెంటర్ నిర్వహణ భారం గా ఉంది. నేటికీ బకాయి టి ఏ డి ఏ కూరగాయలు గ్యాస్ సెంటర్ బకాయిలు ఉన్నాయి. అర్హులైన అంగన్వాడీ కార్యకర్తలకు సూపర్వైజర్ ప్రమోషన్ ఇవ్వాలని 50 సంవత్సరాల వయసు వరకు అనుమతించాలని మినీ వర్కర్లకు సూపర్వైజర్ ప్రమోషన్లు కల్పించాలని హిందీ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తక్షణం తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని(1) పోషణ ట్రాకర్ ఆప్ పనితీరు లో కార్మికుల వేతనాలు ఆహార ధాన్యాలు, నిధులు జత చేయాలని మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు ఉపసంహరించాలని ట్రాకర్ యాప్ లో ఉన్న ఇబ్బందులు పరిష్కరించాలి. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి.సూపర్వైజర్ ప్రమోషన్లు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలి.మినీ వర్కర్లకు సూపర్వైజర్ ప్రమోషన్లు ఇవ్వాలి. బకాయిల బిల్లులు వెంటనే చెల్లించాలి.ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని ఒంటిపూట వరకే సెంటర్ నిర్వహణలో అమలు చేయాలి.అంగన్వాడి సెంటర్ నిర్వహణకు ట్యూబులు ఇవ్వాలి. పై డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఇట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు తాడిపత్రి ప్రాజెక్టు పాల్గొన్నవారు. సెక్టార్ లీడర్లు శంకరమ్మ, గోవిందమ్మ, రమాదేవి, సీఐటీయూ నాయకులు ఉమా గౌడ్, నరసింహారెడ్డి, చౌడయ్య, అంగన్వాడీలు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking