Header Top logo

ఏఐఎస్ఎఫ్ సభలో కామ్రేడ్ శ్రీనివాస్ చౌదరి వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన- నాయకులు

ఏపీ 39టీవీ 02ఫిబ్రవరి 2021:

నగరంలోని స్థానిక కే ఎస్ ఎన్ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామ్రేడ్ శ్రీనివాస్ చౌదరి 35వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు నారాయణ స్వామి , వేమయ్య యాదవ్ , కళాశాల ప్రిన్సిపల్ శంకరయ్య , ఏఐఎస్ఎఫ్ నాయకులు హాజరై ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణస్వామి  మాట్లాడుతూ జిల్లాలో ఈవ్ టీజింగ్ – ర్యాగింగ్ కు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన కామ్రేడ్ శ్రీనివాస్ చౌదరి ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు, జిల్లాలో విద్యార్థినిలు నేడు ధైర్యంగా కళాశాలకు వచ్చి స్వేచ్ఛగా చదువుకుంటున్నారు అంటే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కామ్రేడ్ శ్రీనివాస్ చౌదరి లాంటి నాయకులు పోరాట ఫలితమేనని అన్నారు, ఆర్ట్స్ కళాశాలలో 19 86 మధ్యకాలంలో అదే కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతు కళాశాలలో ఏఐఎస్ఎఫ్ నాయకుడు గా ఉన్నటువంటి కామ్రేడ్ శ్రీనివాస్ చౌదరి కళాశాల ఆవరణలో జరుగుతున్న ఈవ్ టీజింగ్ ర్యాగింగ్ కి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారని, అలాంటి గొప్ప నాయకుడి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పటికీ అక్కడక్కడ ప్రస్తుత సమాజంలో విద్యార్థినిలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ఏఐఎస్ఎఫ్ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లాలని సూచించారు. మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు వేమయ్య యాదవ్  మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమం కోసం ఏర్పడిన విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని స్వాతంత్రం అనంతరం కూడా విద్యారంగ సమస్యల తో పాటు విద్యార్థినీ విద్యార్థులకు స్వేచ్ఛకోసం పోరాటం చేసింది అన్నా నిదర్శనం కామ్రేడ్ శ్రీనివాస్ చౌదరి పోరాటం అని కొనియాడారు, కామ్రేడ్ శ్రీనివాస్ చౌదరి లాంటి నాయకత్వ లక్షణాలు నేటి విద్యార్థి లోకానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు, కళాశాల ప్రిన్సిపాల్ శంకరయ్య మాట్లాడుతూ విద్యార్థినిల కోసం పోరాడి ప్రాణాలర్పించిన శ్రీనివాస్ చౌదరి ఇలాంటి నాయకుల ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు, గతంలో అనేక మంది పోరాటం చేయడంతోనే నేడు విద్యార్థులు అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారని విద్యార్థులకు తెలియజేశారు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్సన్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ ఈ జిల్లాలో ఈవ్ టీజింగ్ ర్యాగింగ్ కి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అందులో కామ్రేడ్ శ్రీనివాస్ చౌదరి అని విద్యార్థులకు గుర్తుచేశారు, ఈ జిల్లాలో నేటికీ ఎప్పటికీ కామ్రేడ్ శ్రీనివాస్ చౌదరి ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కుల్లాయి స్వామి, జిల్లా ఆఫీస్ బేరర్స్ రాజేంద్ర, రమణయ్య, వీరు యాదవ్, నగర నాయకులు మోహన్, పవన్, సాయి, హరి తదితరులు పాల్గొన్నారు. 

Leave A Reply

Your email address will not be published.

Breaking