కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ దేశంలో సామాన్య ,మధ్యతరగతి ప్రజల కు ఏమాత్రం ప్రయోజనం లేదు-కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి.పోతుల నాగరాజు.
ఏపీ 39టీవీ 02ఫిబ్రవరి 2021:
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ దేశంలో సామాన్య ,మధ్యతరగతి ప్రజల కు ఏమాత్రం ప్రయోజనం లేదు.ఇది దేశంలో ఉన్న 10 మంది కార్పొరేట్ లకు మాత్రమే ఉపయోగ పడే బడ్జెట్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి.పోతుల నాగరాజు.దాదాపు 35 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజల కు అనుకూలం గా లేదు అని దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడితే,కేవలము ఇద్దరు లేదా నలుగురు కార్పొరేట్ ప్రతినిధులు బడ్జెట్ మాకు ఉపయోగ కరంగా ఉందనే భావనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజంగా దేశంలో BJP నేతల డొల్లతనం ఈ బడ్జెట్ వల్ల బయట పడుతోంది వారు ఎవరికోసం పాలన చేస్తున్నారు అని.ముక్యంగా వ్యవసాయ రంగం, కార్మికుల సమస్యలను, నిరుద్యోగ సమస్య లను,ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచన చేయకుండా, సంక్షేమ పథకాలు లేకుండా, అభివృద్ధి కి ఎలాంటి చర్యలు లేకుండా, బడ్జెట్ ప్రవేశ పెట్టారు.ముక్యంగా దేశంలో ఉన్న ప్రభుత్వ ఆస్తుల ను తమకు అనుకూలంగా ఉన్న కార్పొరేట్ వ్యక్తుల అప్పగించే కుట్రలకు BJP నాయకులు ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్బర్ భారత్ లో ఎందుకు ఆంద్రప్రదేశ్ లేదు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్, కేరళ,తమిళనాడు కు ప్రకటించిన ప్రాజెక్టు లు ఆంద్రప్రదేశ్ కు ఎందుకు కేటాయించలేదు,ఇది జగన్మోహన్ రెడ్డి చేత గాని తనం వల్లనే అనేది ప్రజల భావన, వైస్సార్సీపీ MP లు 22 మంది ఉన్న పార్లమెంట్ లో నోరు మెదపడం లేదు,అందుకే రాష్ట్ర విభజన చట్టంలో ప్రకటించిన ఒక్క అంశాన్ని కూడా ఈ బడ్జెట్లో ప్రకటించ లేదు.మరి వీరి నాయకత్వం లో రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి చెందుతుంది.కేంద్రం కు విన్నవించరూ.రావాల్సిన నిధులు తీసుకురారు, ఇప్పటికే రాష్ట్ర ము అప్పుల కుప్పగా తయారు అయ్యింది, ఒక మనిషి కి 80 వేల రూపాయలు అప్పు నెత్తి న పెట్టారు. మరి కేంద్రం ర్రాష్టాన్ని ఆదుకోవాలని లేదు,రాష్ట్రంలో ఆదాయవనరులు లేకుండా నిధుల ను వృథా చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయి 7 సంవత్సరాలు అయినా అభివృద్ధి లేదు,రాజధాని లేదు,విద్యార్థుల కు చదువు లు లేవు,పరిశ్రమ లు లేవు,సాగునీటి ప్రాజెక్టులు లేవు,రోడ్లు లేవు,రైల్వే మార్గలు లేవు,మరి ఈ బడ్జెట్ వల్ల రాష్ట్రం కు ఏమి ప్రయోజనం జరిగిన ది అధికార పార్టీ సమాధానం చెప్పాలని, ఇక ప్రతిదీ మా ద్వారా జరుగుతుంది అని గొప్పలు చెప్పుకొని తిరిగే రాష్ట్ర బీజేపీ నాయకులు ఎక్కడ ఉన్నారు అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు kaapu Gajula వాసు,మసాలా రవి,pcc spoke person భాస్కర్ రెడ్డి, dcc secretary అబ్బాస్,sc cell Town president రామాంజనేయులు, రాజ్ కుమార్, గోవిందు తదితరులు పాల్గొన్నారు