Header Top logo

31,32, వార్డులలో ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు- కాలవ శ్రీనివాసులు

AP 39TV 19ఫిబ్రవరి 2021

రాయదుర్గం మేజర్: రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు. శుక్రవారం ఉదయం పట్టణంలోని శాంతినగర్ జమ్మిచెట్టు బన్నీ మహంకాళి ఆలయంలో టీడీపీ అభ్యర్థులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక పట్టణ నాయకులు, టిడిపి అభ్యర్థులతో కలిసి కాలవ శ్రీనివాసులు మరియు మాజీ జెడ్పి చైర్మన్ పూల నాగరాజు ఇరువురు 31, 32వ వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 31 వ వార్డు అభ్యర్థి చంద్రకళ, మరియు 32 వ వార్డు అభ్యర్థి రావుత్ రాజశేఖర్ లను అత్యధిక మెజారిటీ లతో గెలిపించాలని ఓటర్ మహాశయులను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పసుపులేటి నాగరాజు, మండల కన్వీనర్ హనుమంత రెడ్డి, టoకశాల హనుమంతు, గాజుల వెంకటేషులు, పోరాళ్ళ పురుషోత్తం, బుదురు తిప్పేస్వామి చిదానంద, ఎల్లప్ప, నాయకుల తిప్పేస్వామి, నాయకుల మారెప్ప, ఇనాయత్ బాషా,అహమ్మది, గఫూర్, ఖలందర్, ఇస్మాయిల్, యువత దాసరి సత్తి, దాసరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

R.ఓబులేసు,
ఏపీ39టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.

Leave A Reply

Your email address will not be published.

Breaking