AP 39TV 19ఫిబ్రవరి 2021:
అనంతపురం జిల్లాలో నాల్గవ విడత ఎన్నికలు జరుగుతున్న పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని హైపర్ సెన్సిటివ్ గ్రామమైన పందిపర్తిని జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS ఈరోజు సందర్శించారు. గ్రామంలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నిక పోటీలో ఉన్న అభ్యర్థులు మరియు గ్రామస్తులతో మాట్లాడారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణకు తోడ్పడాలని గొడవలు, అల్లర్ల జోలికెళ్లొద్దని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా పాటించాలని సూచించారు. అనంతరం స్థానిక పోలీసు అధికారులు, సిబ్బందితో మాట్లాడి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలుపై దిశానిర్ధేశం చేశారు. జిల్లా ఎస్పీతో పాటు పెనుకొండ సి.ఐ శ్రీహరి, సోమందేపల్లి ఎస్సై రమణ, తదితరులు వెళ్లారు.