AP 39TV 11ఏప్రిల్ 2021:
అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం (AISCSTWA) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మనవల ఆంజనేయులు ఆధ్వర్యంలో జాతిపిత శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే 194 వ జయంతి సందర్భంగా గౌరవనియులు నాకు రక్త బంధువు మీరు,మీకు జై భీమ్ లు. ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినం వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు గౌరవ మీ ద్వారా తెలియచేస్తున్నాను. మహాత్మ జ్యోతిరావు పూలే BC వర్గానికి చెందిన వారు, బాగా ఆస్తి ఉన్న వారు కానీ మొత్తం ఆస్తిని దారబోసి ఆ రోజుల్లో SC ST వర్గాల వారి అభివృద్ధికి పాటుపడ్డారు. సాటి మనిషి మంచి కోరుకుని అందరికి సహాయం చేస్తూ ఇతరుల కొరకు శ్రమ పడ్డారు.గొప్ప విషయం మన పూర్వీకులు కుల వివక్ష ఎదుర్కొంటూ అవమానాలు పడుతుంటే మన SC, ST ల వారిని తన బిడ్డలు అని అక్కున చేర్చుకుని ఆ మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అమ్మ సావిత్రి బాయి పూలే దంపతులు పిల్లలు వద్దు అనుకుని కనలేదు మన మాల, మాదిగ గిరిజన వర్గాలు వారు ని తన బిడ్డలుగా చూసుకుని బతికారు ఆ పుణ్య దంపతులు .అందుకునే మన దేవుడు బాబసాహెబ్ అంబేద్కర్ వారిని తల్లితండ్రి గురువు గా భావించారు.ప్రియుల్లారా మీకు అందుబాటులో ఉన్న వరకు వారి విగ్రహం లేదా వారి ఫొటో వద్దకు వెళ్లి రెండు పూలు చల్లి చేతులు ఎత్తి దణ్ణం పెట్టండి.వారి కోరిక ప్రకారం నడుద్దాము . ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు మన వల్ల ఆంజనేయులు, సింగనమల నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి అధికార వీరనారాయణ, సింగనమల కార్యదర్శి అక్షింతల ప్రమోద్ కుమార్, పామిడి నగర అధ్యక్షుడు ఇల్లూరు సుందరరాజు, తదితరులు పాల్గొన్నారు.