నాకు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి
కాలేజీకి వెళ్ళిన అమ్మాయిలను వేధించిన పోకిరీలను
గుండం గీసి దండించిన రోజులు..
చిన్నారిపై అత్యాచారం చేసిన మానవ మృగాన్ని
నడి బజారులో కాళ్ళు చేతులు విరిచేసిన రోజులు..
ఔను నాకు గుర్తుకు వస్తున్నాయి
కట్నం కోసం నిప్పంటించి
కట్టు కథ అల్లిన
అత్తింటి వారి భరతం పట్టిన రోజులు..
అప్పు డబ్బుల కోసం కోరిక తీర్చమన్న
వ్యాపారి వీపు సున్నం చేసిన రోజులు
ఔను నాకు గుర్తుకు వస్తున్నాయి
భూస్వాములను, రౌడీలను,
పోకీరిలకు దేహశుద్ది చేసిన రోజులు..
అందుకే మళ్లీ ఆ నక్సల్స్ రావాలని
కోరుకుంటున్నారు కొందరు..
( ఆడ బిడ్డలు ఎందరు (ఆత్మహత్యలు) రాలి పోవాలి)
సాక్షి దిన పత్రికా జిల్లా రిపోర్టర్ సేపూరి వేణు గోపాల్ చారి అక్షర ఆవేదన ఇది.
గ్రామీణ ప్రాంతాలలో నక్సల్స్ పోటీ ప్రభుత్వం నడుపుతున్న నాటి రోజులలో ఆత్మహత్యలు లేవు.. రౌడీల రాజ్యం లేదు.. పొలిటికల్ లీడరుల ఫైరావీలు లేవు.. ప్రజలను మోసం చేసే వారు కనిపించలేరు. అత్యాచారం.. హత్యలు లాంటి నేరాలు తగ్గి పోయాయి. కానీ.. ఇప్పుడు పొలిటికల్ లీడరులే భూస్వాముల ఆరాచకాలను మరిపిస్తున్నారు. తప్పు చేసిన వారికే మద్దతుగా నిలుస్తున్నారు.
సోషల్ మీడియా డామినెట్ చేస్తున్న నేటి రోజులలో నక్సల్స్ కార్యకలపాలు ఉన్న నాటి రోజులు యువతకు తెలియక పోవచ్చు. కానీ.. అందరూ నక్సలైట్లు మంచోళ్లే అంటారు. మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం నక్సల్స్ ఎజెండానే మా ఎజెండా అంటూ మీడియా సమావేశంలో ప్రకటించారు.
గతంలో తెలుగు దేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ కూడా నక్సలైట్లే దేశ భక్తులని ఎన్నికల ప్రసారం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో నక్సల్స్ సమస్య శాంతి భద్రతల సమస్య కాదని వారిని చర్చలకు ఆహ్వనించారు. నారా చంద్రబాబు నాయుడు నక్సల్స్ ను హంతం చేశారు.
అయినా.. నక్సల్స్ కు సఫోర్ట్ చేసే వారిని అక్రమంగా అరెస్ట్ లు చేసి ఏళ్ల తరబడి జైల్ లో పెడుతున్నా ఖండన చేయలేని పాలకులు వీరే. పైగా ఎన్ కౌంటర్ ల పేరిట హత్యలు చేస్తోంది కూడా ఈ పాలకులే.
నక్సల్స్ ఎజెండానే మా ఎజెండా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తెలంగాణలో ఇంకా ఎన్ కౌంటర్ లు జరుగుతునే ఉన్నాయి. కేసీఆర్ పాలనలో నాటి నక్సల్స్ కూడా చాలా మందే ఉన్నారు. ఒకప్పుడు నక్సలైట్లుగా పని చేసినామని గర్వంగా చెప్పుకునే పాలకులు స్వార్థం కోసం కేసీఆర్ మెప్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
నక్సల్స్ హింసకాండను సమర్థించడం సరి కాదు. కానీ.. చట్టం అందరికీ సమానమే అంటూ వాళ్లు మాత్రం చట్టాన్ని అతిక్రమిస్తుంటారు.
రాజకీయ నేతల నోట నక్సల్స్ మాట..
ఒకప్పుడు పోటీ ప్రభుత్వం నడిపిన నక్సల్స్ ను బూర్జువ వర్గాలు కూడా మెచ్చుకుంటున్నాయి. గడీల రాజ్యం పోవాలంటే మళ్లీ నక్సల్స్ రావాలని ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. ఇక పోతే కమ్యూనిష్టులం అంటూ చెప్పుకునే ఎర్ర జెండా పార్టీలు మాత్రం ఉసర వెల్లిలా రంగులు మార్చుకుని ఏ వానకు ఆ గొడుగు అనే సందనంగా మారారు.
ప్రాణాలకు తెగించి విప్లవం కోసం పోరాటం చేస్తున్న నక్సల్స్ సిద్దంతాలను సమర్థిస్తునే బూర్జువ వర్గాలతో పోటీ పడుతుంటారు. ఎర్రజెండా పట్టుకుని తాము ప్రజల కోసం పని చేస్తున్నామని చెబుతునే ఆస్తులు సంపాదించడంలో పోటీ పడుతున్నారు. దేవుడు లేడు.. దయ్యం లేడు అనే సిద్దాంతంతో ఉద్యమాలు చేసే కమ్యూనిష్టులు ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటూ ప్రజల వద్దకు వెళుతున్నారు.
ఒక్కటి మాత్రం నిజం..
నక్సల్స్ తుపాకులతో తాత్కలికంగా ఫలితం సాధించవచ్చెమో.. కానీ.. దీర్ఘకాలికంగా పోరాటం చేసి విప్లవం సాధించడం సాధ్యం కాదెమో… విశాలమైన భారత దేశంలో సోషల్ మీడియా డామినెట్ చేస్తున్న నేటి రోజులలో నక్సల్స్ కోరుకునే సాయుద పోరాటంలో పాల్గొనే వారు లేరు. ఆయుధాలను వదిలి జనస్రవంతి బాట పడుతే బాగుంటుందనేది మేధావుల వాదన. మావోయిస్టు నక్సల్స్ నేటి పరిస్థితులకు అనుకులంగా ఆలోచన చేస్తే బాగుంటుందనేది నక్సల్స్ అభిమానుల కోరిక. ఫలితం (విప్లవం) రాదని తెలిసి కూడా ప్రాణ త్యాగాలు చేయడం కంటే జనంలో ఉండి ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటాలు చేసి ప్రజలను చైతన్య వంతులను చేయడం బెటరెమో..???
యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్