Header Top logo

జర్నలిస్టులకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు – మచ్చా రామలింగారెడ్డి

AP 39TV 03మే 2021:

పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని జర్నలిస్టులను అన్ని విధాల ఆదుకోవాలని మచ్చా రామలింగారెడ్డి (రాష్ట్ర అధ్యక్షులు, A.P.J.D.S) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఉదయం ఇటీవల కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులు సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మచ్చా రామలింగారెడ్డి మాట్లాడారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి అన్ని సౌకర్యాలు కల్పించాలని మచ్చా డిమాండ్ చేశారు.జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో వార్తలు సేకరిస్తూ జనాన్ని చైతన్యవంతులను చేస్తున్నారని ఇందులో చాలా మంది జర్నలిస్టు ఇప్పటికే ప్రాణాలర్పించారని వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ.. ప్రభుత్వాలు వెంటనే ఆదుకోవాలని మచ్చా అన్నారు.ప్రపంచ పత్రికా దినోత్సవం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీనియర్ జర్నలిస్టులను సన్మానించి, ప్రపంచ పత్రికా దినోత్సవాని అధికారికంగా నిర్వహించాలని జర్నలిస్టుల సేవలు  ప్రతి ఒక్కరూ గుర్తించుకునే విధంగా అధికారులు, అన్ని రాజకీయ పార్టీలు.. సమావేశాలు నిర్వహించి జర్నలిస్టులను గౌరవించాలని సూచించారు.అనంతపురంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని సూచించారు.రాష్ట్రంలో జర్నలిస్టులు వ్యాక్సిన్ ఇంకా చాలామంది వేయించుకోలేదని అందువల్ల ప్రాణాలు పోతున్నాయని వెంటనే జర్నలిస్టులు అందరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని వారి కుటుంబసభ్యులకు కూడా వేయించాలని మచ్చా రామలింగారెడ్డి సూచించారు.కరోనా సమయంలో జర్నలిస్టులు అందరూ ఐకమత్యంగా ఉంటూ వార్తలు సేకరించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని మీకు కూడా కుటుంబం ఉందని గుర్తుంచుకోవాలని.. జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే అన్ని విధాల సహకారం అందించాలని కోరారు.ప్రపంచ పత్రికా దినోత్సవం విలేకర్ల సమావేశంలో ఆంధ్రప్రభ రాజా, విజయరాజు, షకీర్, శ్రీకాంత్, శ్రావణ్, బాలు జానీ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking