AP 39TV 03మే 2021:
IMFL గోడౌన్లో హమాలీగా పని చేస్తున్న రంగనాయకులు కరోనాతో నిన్నటి రోజున మరణించడం జరిగింది. ఆయన కుటుంబానికి IMFL బెవరీజ్ హమాలీ హమాలీ యూనియన్,AITUC ఆధ్వర్యంలో 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ఈ సందర్భంగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ రంగనాయకులు మరణించడం చాలా బాధాకరం అన్నారు. ఆయన కుటుంబానికి ప్రఘాడ సానుభూతి తెలుపుతూ రంగనాయకులు మరణం యూనియన్ కు తీరని లోటు అన్నారు.AITUC లో ఉన్న కార్మికులు ఎవరైనా మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం ఆనవాయితీ గా వస్తోంది అన్నారు.ఈ కార్యక్రమంలో AITUC నగర ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్, నగర అధ్యక్షులు కృష్ణుడు,IMFL బెవరేజ్ హమాలీ యూనియన్ నాయకులు రమేష్, చల్లా నాయుడు, జయరామ్, దేవదాస్ తదితరుల పాల్గొన్నారు.