Header Top logo

Women the clothes they wear మహిళలు, వారు ధరించే వస్త్రాలు !

Women, the clothes they wear!

మహిళలు, వారు ధరించే వస్త్రాలు !

ఒక సోదరీమణి కామెంట్:

ఆడవాళ్ళు ధరించాల్సిన బట్టలు కూడా మగ వాళ్ళు వేసుకునే బట్టల లాగే ఉంటే బాగుంటుంది కదా అని ఒకోసారి అనిపిస్తుంది. మన దేశంలో, ముఖ్యంగా సౌత్ ఇండియా లో.. ఆడవాళ్ళు ధరించే బట్టలను, ఎందుకనో ధరించిన వారి సగం వొళ్ళు కనపడేలా design చేసారు. తరతరాలుగా మహిళలకు ఆ సాంప్రదాయ బట్టలే ధరించడం అలవాటయ్యింది. ఆడవాళ్ళ బట్టలు అలా design చెయ్యడం ఏంటో ? మళ్ళీ రేప్ జరిగినప్పుడు ఆడవాళ్ళ బట్టలమీదే కామెంట్ చెయ్యడమేంటో ??

Women the clothes they wear

అసలు మగ వాళ్లలాగే ఆడవాళ్లు కూడా

అసలు మగ వాళ్లలాగే ఆడవాళ్లు కూడా ప్యాంటు, shirt వేసుకుని మాత్రమే బయట తిరగాలి అని చట్టం చేస్తే.. ఆడవాళ్లు కూడా happy గా ఫీల్ అవుతారు కదా అని నా అభిప్రాయం. అలా ఐతే మాకు Seperate గా ఓ handbag మొయ్యాల్సిన అవసరం ఉండదు. Bus లు ఎక్కడానికైనా, దిగడానికైనా, స్కూటీలు, బైక్ లు నడపడానికైనా comfort ఉంటుంది.
ఇప్పటి జనరేషన్ అమ్మాయిలు, కొంత update ఐనారనుకోండి, but మా జనరేషన్ వాళ్ళు face చేసే ప్రాబ్లెమ్ గురించే నేను చెప్తున్నాను. Women the clothes they wear

Women the clothes they wear

పై కామెంట్ కు, నా జవాబు..

ప్రజాస్వామిక దేశంలో “ఎవరెవరు ఎలాంటి బట్టలు ధరించాలి” అన్న విషయం మీద చట్టాలు చేయడం కుదరదు. ఐనా చట్టాలు చేసినంత మాత్రాన పరిస్థితి పూర్తిగా మారిపోతుంది అనుకోవడం అమాయకత్వమే ఔతుంది. ఉదాహరణకు “వరకట్న నిషేధం చట్టం” ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పటికీ ఆ దురాచాన్ని (ఆ చట్టం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు కూడా) కొనసాగిస్తూనే ఉన్నారు. మన సమాజంలో చైతన్యం రానంత వరకు ఏ చట్టమూ, ఏ సాంప్రదాయాన్ని రూపుమాపలేదు. ఇక మహిళలు ధరించే దుస్తుల విషయానికి వస్తే.. వారు, వారికి సౌకర్యవంతంగా ఉండే (ప్యాంటూ, షర్టూ మొదలైన) బట్టలు ధరిస్తే ఇపుడున్న చట్టాలేవీ అభ్యంతరం పెట్టవు కూడా. వారిని అభ్యంతరం పెట్టేది వారి ఇంట్లోని సాంప్రదాయవాదులే..

Women the clothes they wear

కంఫర్ట్ గా ఉండే బట్టలు..

కాబట్టి ఇపుడు కావాల్సింది కొత్త చట్టాలు కాదు. ఇక సాంప్రదాయ వాదులు, ప్రత్యేకించి ఇంట్లోని మగ వాళ్ళు తమ వక్ర బుద్దిని మార్చుకొని, తమ తమ ఇండ్లలోని మహిళలను ఒప్పించి, వారు ప్యాంటూ, షర్టూ లేదా పంజాబీ మహిళల మాదిరిగా.. పైజామా, నెహ్రూ షర్ట్ లేదా వారికి (మహిళలకు) సౌకర్యవంతంగా ఉండే విధంగా మరేదైనా డ్రెస్ ధరించేలా (మహిళలను) ఎంకరేజ్ చేయాలి, అంతే.. మా ఇంట్లో మా Padma Chelimela గారైతే ఈ ఏజ్ లో కూడా తన వస్త్రధారణ పద్దతులు మార్చుకున్నారు. ఎపుడో ఒకసారి ప్రత్యేకమైన సందర్భాలలో తప్ప, ఇపుడు తనకు కంఫర్ట్ గా ఉండే బట్టలు (అంటే.. చుడీదార్ పైజామా లు లేదా ప్యాంటు షర్ట్ లు మాత్రమే..) ధరిస్తున్నారు. Women the clothes they wear

అన్ని ఇండ్లలో కూడా ఇలాంటి మార్పులు చోటుచేసుకోవాలని ఆశిస్తున్నాను.

– చెలిమెల రాజేశ్వర్, న్యాయవాది

Leave A Reply

Your email address will not be published.

Breaking