Header Top logo

The true story of two girls ఇద్దరు అమ్మాయిల నిజమైన కధ

The true story of two girls

ఇద్దరు అమ్మాయిల నిజమైన కధ

ఈ కధ ముప్పై అయిదేళ్ళ క్రితం 12 మార్చి 1982 న మాదాపూర్ అనే గ్రామం లో ఉత్తర ప్రదేశ్ లోని గౌండ జిల్లాలో మొదలయ్యింది.

క్రిమినల్స్ గురించి సమాచారం రావటం తో తన సబ్ అర్దినేట్స్ తో కలిసి డిఎస్పీ  ఎస్.పి. సింగ్ రాత్రి వేళ హుటాహుటిన వెళ్ళాడు. అతని శరీరం మర్నాడు ఉదయం ప్రభుత్వ అసుపత్రి కి చేరింది. మరో 12 మంది దుండగులతో కలిసి అతను బాంబు దాడిలో చనిపోయినట్లు బార్య విభాసింగ్ కి సమాచారం పంపారు.నిజానికి డిఎస్పీ సింగ్ కి అతని సబ్ అర్దినేట్స్ కి మధ్య ఉన్న వైరం అతన్ని పొట్టన పెట్టుకుంది. అతని సబ్ ఆర్దినేట్స్ ఒక నకిలీ ఎన్కౌంటర్ లో చంపేశారు.

దయచేసి నన్ను కాల్చొద్దు

“దయచేసి నన్ను కాల్చొద్దు. నాకు ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు” అనేది ఆయన చివరి మాట. సింగ్ భార్య ‘విభా సింగ్’ హై కోర్టుని ఆశ్రయించింది. సిబిఐ కి కేసు బదలాయించారు. తోటి ఉద్యోగులు క్రిమినల్స్ తో కలసి ఈ దారుణానికి పాల్పడినట్లు సిబిఐ చార్జ్ షీట్ ఫైల్ చేసింది. సుదీర్గమయిన కోర్టు ప్రక్రియ మొదలయింది. The true story of two girls

న్యాయం కోసం తల్లి చేసిన పోరాటం

డిఎస్పీ సింగ్ హత్య జరిగినప్పటికి, అతనికి బార్య విభా సింగ్ కి కింజాల్ అనే ఆర్నెళ్ళ పాప, ఇంకా లోకం చూడని (ప్రింజాల్ సింగ్) బిడ్డ ఉన్నారు. తల్లి కి వారణాసి ట్రెజరీ లో ఓక చిన్న ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. తండ్రి మరణాన్ని ప్రశ్నిస్తూ న్యాయం కోసం తల్లి చేసిన పోరాటం నీరు కారి పోయింది. భర్త తో పాటు పని చేస్తున్న ఉద్యోగులు ఆమెకి ఎవరు సహకరించలేదు.

డిఎస్పీ భార్య జాబ్ లో..

ఆమె ఉద్యోగం లో జాయిన్ అయింది. రెండో బిడ్డ భూమి మీదకి వచ్చింది. ఇద్దరు పిల్లలని ఆమె చదివించడం మొదలెట్టింది. కొద్ది ఆదాయం, తండ్రి లేని ఒంటరి కుటుంభం. అన్ని రకాల గడ్డు సమస్యలని ఎదుర్కుంది. పిల్లలిద్దరూ వారి చదువుల కోసం అనేక త్యాగాలు చేసారు. తండ్రి ఫోటో ని చూస్తూ.. అతన్నే ఇన్స్పిరేషన్ గా తీసుంటూ ఇష్టపడి చదువు సాగించారు. The true story of two girls

తల్లికి క్యాన్సర్..

పెద్దమ్మాయి కింజాల్ డిల్లీ లోని అత్యున్నతమయిన “లేడి శ్రీరాం కాలేజ్” లో సీటు సంపాదించింది. కింజాల్ డిగ్రీ మొదటి సంవత్సరం లో ఉన్నప్పుడు తల్లి కి క్యాన్సర్ అని తెలుసుకుంది. ఆమె ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని తెలిసిన రెండు రోజుల కి వ్రాసిన పరిక్షల లో ఆమె యునివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. తల్లి మరణ శయ్య వద్ద తామిద్దరు UPSC క్రాక్ చేస్తామని మాట ఇచ్చింది.

వాల్లిదరికి తల్లి తండ్రి ప్రేరణ

2004 లో తల్లి మరణానంతరం అక్క చేల్లెల్లిద్దరు డిల్లీ చేరారు. ముఖర్జీ నగర్ లో ఒక సాదారణ గది లో నివాసం ఉంటూ UPSC కి చదవటం మొదలెట్టారు. మిత్రుల వద్ద అరువు తెచ్చుకున్న పుస్తకాలతో వాళ్ళు యజ్ఞం మొదలెట్టారు. స్వగ్రామం మరిచి పోయారు. బందువులు లేరు. ఒక పండగ లేదు ఒక సరదా లేదు. ఒక విరామం లేదు. వాళ్లిద్దరు ఒకరి కొకరు ప్రేరణ. వాల్లిదరికి తల్లి తండ్రి ప్రేరణ.

ప్రపంచానికి కోర్టు రుజువు చేసింది

2007 లో కింజాల్ సింగ్ IAS, ప్రింజాల్ సింగ్ IRS ని సాధించారు. వారిద్దరి పట్టుదల విజయగాధ జ్యుడిషిల్ వ్యవస్థని తాకింది. తండ్రి ని చంపిన 31 ఏళ్ల తర్వాత, చార్జ్ షీట్ చేసిన 27 ఏండ్ల తర్వాత ఎనిమిది మంది పోలిస్ అధికారులని నిందితులుగా నిర్ధారించింది. ఎస్ పి సింగ్ నిజాయితీని, తల్లి ఆరోపణలని నిజమని ప్రపంచానికి కోర్టు రుజువు చేసింది. తీర్పు చెప్పినప్పుడు అప్పటి ‘లక్ష్మి పుర ఖేరి’ జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ గా ఉన్న కింజాల్ సింగ్ దుఖం దాచుకోలేక పోయింది. కన్నీటి పర్యంతం అయింది.

ఆడపిల్లలని తక్కువ గా చేసి చూసే/మాట్లాడే వాళ్లకి కింజాల్ సింగ్, ప్రింజాల్ సింగ్ ఒక సమాధానం. దేశం గర్వించదగ్గ ఈ సోదరీమణులు ఇద్దరు నేటి అనేక మంది పిల్లలకి ఆదర్శం.

సేకరణ: భేతాళ సుదర్శన్

Leave A Reply

Your email address will not be published.

Breaking