Header Top logo

చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వైద్య సేవాలు

డాక్టర్ మధుశేఖర్ వైద్య బృందం సేవాలు  భేష్

: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్, ఏప్రిల్ 16 (వైడ్ న్యూస్) ప్రజలకు వైద్య సేవాలు అందించే డాక్టర్ లు దేవుడితో సమానం అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అమెరికాలో భీమ్ గల్ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రేమలత సురేందర్ కుమారుడు ఆనారోగ్యానికి గురైతే ప్రాణాలు కాపాడింది వైద్యులని గుర్తు చేశారు మంత్రి. డాక్టర్ మధు శేఖర్ బృందం చేస్తున్న వైద్య సేవాలకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

భీమ్ గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్  పాఠశాలలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్వర్యంలో నిర్వహించిన 44వ ఉచిత మెగా హెల్త్, సర్జికల్ క్యాంప్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంతాలలో పేదలకు ఉచిత వైద్య సేవాలందించాలని డాక్టర్ మధుశేఖర్ ప్రారంభించిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా 45 మంది వైద్యులు సేవాలందించడం సంతోషంగా ఉందన్నారు ఆయన. భీమ్ గల్ లో ప్రారంభించే 100 పడకల ఆసుపత్రిలో వారంకు ఒకరు స్పెషాలిస్ట్ డాక్టర్ ఈ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవాలందిస్తే తాను సహాయం చేస్తానన్నారు ఆయన.

డాక్టర్ మధుశేఖర్ పేదలకు సేవాలందించడానికి వైద్య శిభిరం ఏర్పాటు చేయడానికి తాను అన్ని విధాల సహాయ సహాకారం అందిస్తానన్నారు మంత్రి. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు మరవలేనివి, గత 20 సంవత్సరాల నుండి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్న డా. మధుశేఖర్ అందరికీ ఆదర్శప్రాయుడు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొనియాడారు.

ఒకే వేదిక పై 45 మంది పైగా డాక్టర్లు ప్రజలకు ఉచితంగా వైద్యం, మందులు అందజేయడం గొప్ప విషయమన్నారు మంత్రి. గత రెండు దశాబ్దాలుగా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్వర్యంలో నిర్వహించిన సేవలు గొప్పవని డా.మధు శేఖర్ నీ అభినందించారు.

భీమ్ గల్ లో 100 పడకల ఆసుపత్రిలో సేవాల కోసం..

పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి, అందులో భాగంగా పట్టణంలో 100 పడకల ఆసుపత్రి మంజూరు అయ్యిందన్నారు ఆయన. ఆసుపత్రి భవన నిర్మాణ పనులు పూర్తి కావస్తుందన్నారు ఆయన.  పట్టణంలో గత ముప్పై సంవత్సరాలుగా సేవలు అందించిన డాక్టర్లు  బసంత్ రెడ్డి, బెజురెడ్డిలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, డా.మధు శేఖర్ సన్మానించారు.

ఈ ప్రాంతంలో ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశ్యంతో  డాక్టర్ మధుశేఖర్ ఆర్మూర్ ప్రాంతంలో ఎంజె హాస్పిటల్ నెలకొల్పిండన్నారు తెలంగాణ ఉన్నత విద్య మండలి చైర్మన్ రిక్క లింబాద్రి. డాక్టర్ మధుశేఖర్ చేతి నైపుణ్యం చాలా గొప్పదన్నారు ఆయన.

చేయూత ద్వారా ఎందరికో ఉచిత ఆపరేషన్లు చెయ్యడం గొప్ప విషయమన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  వల్ల ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు ఆయన. చిన్నప్పుడు తాను చదివిన రోజులలో ఉన్న భీమ్ గల్ గుర్తు చేసుకుని ఇంతా అభివృద్ది జరుగడానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి కృషి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  హైదరాబాద్ నడి బొడ్డున అంబెడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యావేక్షించారన్నారు ఆయన.

వైద్య సేవాల విలువ 40 లక్షలకు పైనే..

: డాక్టర్ మధుశేఖర్

పేదల వద్దకు వైద్యం అనే సంకల్పంతో 2001లో చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉచిత వైద్య సేవాలందిస్తున్నట్లు తెలిపారు వ్యవస్థాపకులు డాక్టర్ మధుశేఖర్. ఈ క్యాంప్ ద్వారా ఔట్ పేషెంట్లు 1836, మైనర్ ఆపరేషన్లు 39 మందికి చేశామని, 19 మందికి స్కానింగ్, 26 మందికి ఈసిజి చేశామని, 21 మంది రక్తదానం చేశారని అన్నారు. సుమారు ఈ క్యాంప్ యొక్క సేవల విలువ 40 లక్షల వరకు ఉంటుందన్నారు ఆయన.

పేదలకు ఉచిత సేవా చెయ్యడమే చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ లక్షామన్నారు. ఒకరికి ఒకరు చేయూత నిచ్చి ముందుకు వెళ్లుదామని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి  కార్యక్రమాలు మరిన్ని చేపడతామని ఈ క్యాంప్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు  తెలిపారు డాక్టర్ మధుశేఖర్. మున్సిపల్ చైర్ పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్, సీనియర్ జర్నలిస్ట్ యాటకర్ల మల్లేష్, సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ ప్రసంగించారు.

ఈ క్యాంపుకు వచ్చిన ముఖ్య అతిథి మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డిని చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థకులు డాక్టర్ మధు శేఖర్ ని, వైద్య శిబిరంలో పాల్గొంటున్న వైద్యులను సోలేమాన్ ఆధ్వర్యంలో స్కౌట్స్ అండ్ గైడ్స్  విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మానస గణేష్ స్వాగత ఉపన్యాసం ఇచ్చారు.

చేయూత కోఆర్డినేటర్  కలిగోట గంగాధర్ చేయూత స్వచ్ఛంద సంస్థ నివేదికను సమర్పించారు. ఈ హెల్త్ క్యాంపులో డాక్టర్ వసంత కుమారి, డాక్టర్ లింగారెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ శృతి, డా శిరీష, మునిసిపల్ చైర్ పర్సన్ Smt కన్నె ప్రేమలతో సురేందర్, వీడీసీ అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్, సీనియర్ జర్నలిస్ట్ యాటకర్ల మల్లేష్  ప్రసంగించారు.

ఈ శిబిరంలో డా,, నంధిత, డా,, రాజశ్రీ, డా,, శ్రీ లత, Dr, శ్వేత, Dr పద్మ, Dr ముత్యం రెడ్డి ,Dr బాల్ రెడ్డి, డా,, ఎన్ రవీందర్, డా,, అమృత రామిరెడ్డి , డా,, సాహిత్ ,, డా,, నరేష్ ,Dr నాగరాజు , Dr సాగర్ , డా,, రాజేశ్వర్, Dr వెంకట్ రమణ, Dr సాహిత్,Dr రాజేష్, Dr అజయ్, Dr Ramesh Reddy, Dr Balreddy,Dr వంశీకృష్ణ, Dr రాజు, Dr ఆది శ్రీనివాస్, Dr శ్రావణ్ రెడ్డి, డా,,విజయ్, Dr రఘు. డా,, రావోజీరావు,తదితరుల డాక్టర్లు & ఎంజి హాస్పిటల్ సిబ్బంది, ఐడియా సాగర్. రాకేష్ చంద్ర, తులసి దాస్ క్రాంతి, పద్మ మురళి,  జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

సరస్వతి విద్యా మందిర్ పాఠశాల ప్రిన్సిపాల్ నర్సారెడ్డి, వివిధ యువజన సంఘాలు, సర్వ సమాజ్ కమిటీ, క్యాంప్ కో ఆర్డినేటర్లు రాజు, జేజే నర్సయ్య, పర్స నవీన్, సంధ్య నగేష్, సాగర్ ఎం జే అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking