This is the right time to delete ! డిలీట్ చేసే సరైన సమయమిదే !
This is the right time to delete !
డిలీట్ చేసే సరైన సమయమిదే !
సమయం! time
మన మనసుతో, మనశ్శాంతితో
బంధాలతో, అనుబంధాలతో
ఎమోషన్లతో ఆడుకునే వాళ్ళను …
ఆత్మీయులుగా అభిమానాన్ని చూపిస్తూ
మన బలాలను బలహీనతలను
అవకాశాలుగా వాడుకునేవాళ్ళను …
మన చరిత్ర పుటనుండి
ఆనవాల్లేకుండా డిలీట్ చేసే సరైన సమయమిదే !
మన నైపుణ్యత జయాపజయాల్ని చూసి
సన్నిహిత సహచరులలో ఆవేశాలు రగిల్చి
అసహనం నింపి విడదీసేవాళ్ళను…
మనతో మర్యాదగా ఉంటూ అదేపనిగా
పొగడుతూ నమ్మబలికే అబద్ధాలతో
అవసరాలకై విశ్వాసంగా నటించేవాళ్ళను…
మనచరిత్ర పుటనుండి శాశ్వతంగా చెరిపేసి
డిలీట్ చేసే సరైన సమయమిదే !
అలాగే….
మనల్ని హేళనచేసే మిత్రులను
గౌరవించని బంధువులను
ప్రోత్సహించని గురువులను
నిగూఢంగా నిందలేసే మోసగాళ్ళను
అవకాశాన్ని వాడుకునే సహాధ్యాయులను
నువ్వులేనిది జీవితంలేదనే స్వార్థపరులను
మన చరిత్ర పుటనుండి నిర్దయగా
డిలీట్ చేసే సరైన సమయమిదే !
అందుకే…
కమనీయంగా మలచుకొని
రమణీయంగా నిలుపుకునే జీవితాన్ని
కలుశిత కొలనులో కలువనివ్వక
నిజాయితీ ఆలోచనల మెట్లను
నీతినియమాల నిర్భయకవచంతో ఎక్కుతూ
నయనానంద కరమైన సుమనోహర
సుందర మనోల్లాస మానససరోవర
తీరాన్ని పరీక్షించి చూస్తే…
మందార మకరంద మల్లెల కోమలత్వం
కమల పారిజాత విరజాజుల లావణ్యం
ఆనందనందన నందివర్ధన పుష్పవనం
దేదీప్యమాన పర్వమే !
మనసు ఆహ్లాదకర విహాంగ విహారియై
ఆత్మ హిమతుషార సోయగమై పయనమైతే
సమ్మోహనసామ్రాజ్యంలో సంతోషంతో
స్వాంతనతో శ్వాసిస్తాయేమో ఆశలు !
సత్యం నిత్యమై, విద్యకు విలువలు తోడుంటే
సార్థకతనిస్తాయేమో ఆశయాలు !!