ఈటెల రాజేందర్ అవకాశవాది..
: బండా ప్రకాష్ ముదిరాజ్ సంచలన వ్యాఖ్యాలు
బండా ప్రకాష్ ముదిరాజ్ ను ఇంటార్వ్యూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకప్పుడు ఈటెల రాజేందర్ తో సన్నిహీతంగా ఉన్న బండా ప్రకాష్ ముదిరాజ్ తాను ఎప్పుడు ఈటెల రాజేందర్ గురించి నిక్కచ్చిగా అబిప్రాయం చెప్పిన సందర్బం చాలా తక్కువే.. కానీ.. ఓ విలేకరి వేసిన ప్రశ్నలకు ఘాటుగా సమాధానం ఇచ్చాడు బండా ప్రకాష్ ముదిరాజ్.
‘‘పాత టీఆర్ ఎస్ పార్టీని తిరిగి ఈటెల రాజేందర్ లాంటి పాతోళ్లు తీసుకు వస్తున్నారట గదా..?’’ విలేకరి ప్రశ్న
‘‘అది సరైంది కాదు.. ఆయన అవకాశం వచ్చి మొదట్లో పార్టీలో చేరిండు. కేసీఆర్ గారు అవకాశం ఇచ్చిండు ఈటెల రాజేందర్ నాయకుడు అయ్యిండు. అవకాశాలు దొరుకక పోతే నాయకుడు అయ్యేవాడు కాదు. హుజురాబాద్ కు పోయే నాటికి ఆయన (ఈటెల) ఎవరికి తెలియదు. ఆయన వేరే ప్రాంతంలో ఎమ్మెల్యే సీట్ అడిగిండు. నీవు పోవాలని కేసీఆర్ గారు హుజురాబాద్ పంపిండు. అప్పటికే హుజురాబాద్ లో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. జడ్ పిటీసీలు, ఎంపీపీలు గెలుసుకున్నాం. పార్టీ బలంగా ఉందని పంపిస్తే ఆయన (ఈటెల) ఎమ్మెల్యేగా గెలిసి వచ్చిండు. నాయకుడు అయ్యిండు. విజన్ లోపం వల్ల ఇప్పుడు నష్ట పోతాడు’’ కూల్ గా సమాధానం ఇచ్చాడు బండా ప్రకాష్ ముదిరాజ్.
‘‘విజన్ లోపం అంటే ఎట్లా అనుకుంటారు’’ అని విలేకరి ప్రశ్న
‘‘రాజేందర్ గారు వంద శాతం విశ్వాషించి బీజేపీలోకి పోయాడా అతనిని అడుగండి…? జై శ్రీరాం భక్తుడా.. అడుగండి.? ఆర్ ఎస్ ఎస్ భావ జాలంతో ఉంటాడా అడుగండి..? బీజేపీ వాళ్లు చెప్పింది వింటారా అడుగండి. ఈటెల రాజేందర్ అవకాశ వాదంతో పోయిన దానికి తేడా ఉంటాది.