Header Top logo

విద్య,వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం – ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మేయర్ వసీం

AP 39 TV 04 జూన్ 2021:

ఆరోగ్యాంద్ర ప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి,మేయర్ వసీం పేర్కొన్నారు.శుక్రవారం నగరంలోని బుడ్డప్పనగర్ లో అర్బన్ హెల్త్ సెంటర్ కు శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ,నగర మేయర్ మహమ్మద్ వసీం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.అందులో భాగంగా నగర పరిధిలో 6 అర్బన్ హెల్త్ సెంటర్లను నిర్మాణాలను చేపడుతున్నట్లు ఒక్కొక్కటి 80 లక్షల రూపాయల వ్యయంతో 4 కోట్ల 80 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు.అంతేకాకుండా 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి నగరంలో మరో 4 అర్బన్ సెంటర్ల మరమ్మతులు చేపట్టి ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.విద్య వైద్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకడుగు వేయడం లేదని,అందులో భాగంగా అడిగిన వెంటనే జిల్లా కేంద్రమైన అనంతపురం లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  జిల్లా సర్వజన ఆసుపత్రి,మెడికల్ కాలేజ్ విస్తరణకు చర్యలు చేపట్టారని వీటి కోసం రూ.300 కోట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేటాయించారని తెలిపారు.వీటితోపాటు ఇటీవల 8.32 ఎకరాలు భూమిని సైతం ఉచితంగా ఆసుపత్రికి బదలాయించడం జరిగిందన్నారు.జిల్లా ఆసుపత్రి విస్తరణ పూర్తి అయితే ప్రస్తుతమున్న 500 పడకల సామర్థ్యం 1200 పడకల స్థాయికి పెరగడంతో పాటు గర్భవతులు చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. అదే విధంగా పెనుగొండ వద్ద నూతనంగా మెడికల్ కళాశాలను సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంజూరు చేశారని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో రాబోవు రోజుల్లో అనంతపురం నగరాన్ని వైద్య కేంద్రంగా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.నగర ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నామని కోవిడ్ రక్షణ కోసం ప్రస్తుతం అమలు చేస్తున్న లాక్ డౌన్ మూలంగా కొంత వరకు కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ఇదే సహకారాన్ని అందిస్తే పూర్తి స్థాయిలో కరోనా నిర్ములన సాధ్యమవుతుందన్నారు.నగర మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూనగర ప్రజల కోసం నూతన అర్బన్ హెల్త్ సెంటర్ ల నిర్మాణం గొప్ప కార్యక్రమమన్నారు.నగర ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు.అందులో భాగంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కృషితో 6 అర్బన్ హెల్త్ సెంటర్లకు కొత్త భవనాలు నిర్మిస్తున్నామన్నారు.త్వరగా వీటి నిర్మాణం పూర్తి చేసి నగర్ ప్రజలకు వైద్యన్ని మరింత అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.నగరంలో విద్య,వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.నగర అభిరుద్దికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ,ఇంచార్జి మంత్రి బొత్స సత్యనారాయణ  అందిస్తున్న సహకారం మరువలేనిది పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మూర్తి ,పలువురు కార్పొరేటర్లు,పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking