Header Top logo

ప్రారంభమైన విజ్ఞానదర్శిని మహిళా టీచర్ల ఫెస్ట్ 2023

సావిత్రీబాయి ఫూలే 192వ జయంత్యుత్సవాలు*

సావిత్రిబాయి పూలే గారి 192 వ జన్మదినాన్ని పురస్కరించుకొని విజ్ఞాన దర్శిని సంస్థ గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉమెన్స్ టీచర్స్ ఫెస్ట్ 2023 కార్యక్రమాన్ని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లోని మెకస్టర్ ఆడిటోరియంలో  ఈరోజు ప్రారంభించింది. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి మహిళా ఉపాధ్యాయులు తమతమ కళ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఇక్కడికి వచ్చారు ఐదు భాగాలుగా విభజించిన ఈ స్కిట్స్ లలో అందరూ పాల్గొన్నారు.
ఈ పోటీలు ప్రారంభానికి ముందు జరిగిన సమావేశానికి సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ టి. రమేష్ గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వి రాధా సిసిఎంబి ఎమిరిటస్ సైంటిస్ట్ పాల్గొన్నారు. వక్తలు గంటా రవీందర్ మహాత్మా గాంధీ హెల్పింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు, విజ్ఞాన దర్శిని సంస్థ అధ్యక్షులు టి. రమేష్ గారు, ప్రొ.బి.ఎన్.రెడ్డి గారు, ప్రొ.కె.సుజాత గారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గారు దాదాపు 200 సంవత్సరాల క్రితమే వివక్షను ఎదుర్కొని అనేక సమస్యలను చేదించారని ఇందుకు కారణం మహిళల్లో విద్య లేకపోవడం అని గ్రహించి తన ఇల్లునే పాఠశాలగా మార్చి మహిళలందరికీ విద్యాబోధన చేసేవారని చుట్టుపక్కల ఉన్న పలు ప్రాంతాలకు విద్యను అందించేందుకు నిన్ను వెళ్లే క్రమంలో చాలాసార్లు దాడులు జరిగాయని వాటిని గట్టిగా ఎదుర్కొన్న మహిళగా నేడు మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె చరిత్రలో నిలిచారని ఆమె చేసిన సేవల్ని కొనియాడారు
సైంటిస్ట్ వి. రాధా గారు మాట్లాడుతూ విద్యార్థుల్లో నేడు సృజనాత్మకత లోపిస్తుందని సొంతంగా ఆలోచించే శక్తి సామర్థ్యాలు కోల్పోతున్నారని ఇప్పుడు వస్తున్న ఆధునిక గాడ్జిస్ట వల్ల వాటికి బానిసలుగా మారడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందని దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఎదుర్కోవాలని విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి సమాజానికి మంచి వైజ్ఞానిక దృక్పధం గల వ్యక్తులుగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని వచ్చిన ఉపాధ్యాయులు ఉద్దేశించి కోరారు.
గంట రవీందర్ గారు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యనే గాక సమాజం పట్ల బాధ్యత సేవా తత్పరత తప్పక నేర్పించాలని ఇలా నేర్పించినప్పుడే మంచి సమాజం ఏర్పడుతుందని మూఢనమ్మకాలకు దూరంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులు కోరారు. కోశాధికారి జి. తులసీరామ్ గారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా అనేక సైన్స్ కార్యక్రమాలతో పాటు సమాజసేవ, మూఢనమ్మకాల నిర్మూలన కోసం వైజ్ఞానిక ప్రదర్శనలు చాలా చోట్ల నిర్వహించిందని సమాజంలో మూఢనమ్మ నిర్మూలన మూఢనమ్మకాల నిర్మూలన జరిగేందుకు తన వంతు కృషి చేస్తుందని అందుకోసం ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంపొందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ విజ్ఞానాన్నీ జోడించి పిల్లలకు విద్యాభ్యాసం చేయాలని అలా చేస్తేనే వారికి సమాజం పట్ల సేవా దృక్పథం అలవడి మంచి పౌరులుగా ఎదుగుతారని కోరారు.
ఈ కార్యక్రమంలో విజ్ఞానదర్శిని సంస్థ నాయకులు నాస్తిక్ సూర్య, శోభారాణి, శ్రీతేజ శివరాం, పరమేష్,విష్ణువర్ధన్, మహేష్ , ఆఫ్రీన్, ఆలీ, సాగర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking