Header Top logo

హైదరాబాదులో వివాహిత ఆత్మహత్య

జగిత్యాల్ : రుద్రంగీ మండలం సర్పంచ్ తండా గ్రామానికి చెందిన వివాహిత హైదరాబాద్ లో గురువారం ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం….

సర్పంచ్ తండా సర్పంచ్ రమణయ్య కుమారుడు మాలోతు ప్రసాద్ కు దర్పల్లి గ్రామానికి చెందిన మంజులతో గత 2 సంవత్సరాల క్రితం వివాహం అయింది.

వీరికి 14 నెలల కుమారుడు ఉన్నాడు.

వీరిద్దరూ హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు.

ప్రసాద్ హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కాగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడినట్లు తెలిపారు.

విషయం తెలుసుకున్న మంజుల కుటుంబ సభ్యులు హైదరాబాదులోని హాకింపేట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా పోలీసులు మృతురాలి భర్త ప్రసాద్ ని అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మంజుల మృతి విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు రుద్రంగి మండలంలోని సర్పంచ్ తండా ప్రసాద్ ఇంటికి భారీ ఎత్తున చేరుకోవడంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సి.ఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో చెందుర్తి , కొనరవుపెట్ , రుద్రంగి ఎస్ ఐ ప్రభాకర్ పోలిీష్ బెటాలియన్ తొో భారీగా పోలీసులను మోహరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking