అనారోగ్య వితంతు మహిళ కు ఆర్థిక సహాయం చేసిన -బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ శ్రీమతి పొత్తూరి
AP 39TV 16మార్చ్ 2021:
అనంతపురం నగరంలోని 2వ రోడ్డు లో నివాసం ఉంటున్న వితంతు మహిళ శ్రీమతి జీ. విజయలక్ష్మి కూలి పని చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నది.ఈమెకు గుండెలో రంద్రం ఉంది.అందువలన కూలి పనిచేయడానికి ఆరోగ్యం సహకరించక పోవడం వలన జీవనోపాదికి ఇబ్బందిగా ఉంది. తనకున్న ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి ఆమె ఆరోగ్యం సహకరించకపోవడం చేత తనకున్న అనారోగ్య సమస్యను బాగు చేసుకోవడానికి బీజేపీ పార్టీని ఆశ్రయించడంతో బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ శ్రీమతి పొత్తూరి రంగమ్మ 50,000(యాభై వేల రూపాయలు) బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ సందిరెడ్డి శ్రీనివాసులు సమక్షంలో ఆర్థిక సహాయం చేసారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి బి.ఆనంతకుమారి , సుజాత ,విజయలక్ష్మి,డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొనంకి శ్రీధర్, శ్రీ గొంది అశోక్,సదాశివ రెడ్డి,తదితర నాయకులు పాల్గొన్నారు.