AP 39TV 16మార్చ్ 2021:
ఆర్ట్స్ కళాశాల వసతి గృహాలు ప్రారంభించాలని నాడు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ నాగలింగ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణం వసతి గృహాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కరోనా లాక్ డౌన్ అనంతరం విద్యాసంస్థలు ప్రారంభించి మూడు నెలలు గడుస్తుండడంతో సుదూర ప్రాంతాలనుండి మరియు ఇతర జిల్లాల నుంచి ఈ కళాశాలలో చేరి విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు ఇప్పటికి కళాశాలకు రాకపోవడానీకి ప్రధాన సమస్య విద్యార్థులకి వసతి సౌకర్యం లేక అని అన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మొదలుకొని యూనివర్సిటీ స్థాయి వరకు వసతిగృహాలు ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికి ఆర్ట్స్ కళాశాల వసతి గృహాలు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలోనే పాఠశాల స్థాయి నుండి పీజీ దాకా వసతి గృహాలు ప్రారంభించి, ఎస్కేయు,జె ఎన్ టి యు యూనివర్సిటీల వసతి గృహాలను సైతం ప్రారంభించినప్పటికీ ఆర్ట్స్ కళాశాల వసతి గృహాలు ప్రారంభించక పోవడం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటమనే అని అన్నారు. ఇప్పటికే అనేకమైన సిలబస్ పూర్తి అవుతున్నందున త్వరలోనే సెమిస్టర్ పరీక్షలు దగ్గరపడుతున్నప్పటికీ, ఇప్పటికీ అత్యధిక శాతం మంది విద్యార్థినీ,విద్యార్థులు వసతి గృహాలు ప్రారంభించక పోవడంతో కళాశాలకు రాలేని పరిస్థితులని అన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కి పరిపాలన విభాగం పట్ల అవగాహన లేకపోవడం వల్లనే వసతి గృహాలను ప్రారంభించ లేక పోతున్నారని స్పష్టమవుతోందని అన్నారు. విద్యార్థులకు అనుగుణంగా పరిపాలన కొనసాగించడం చేతకాకపోతే రాజీనామా చేసి వేరే బాధ్యతల్లో ఉండాలని విద్యార్థులను ఇబ్బందులకి గురిచేయడం భావ్యం కాదన్నారు. ఇప్పటికైనా విద్యార్థుల యొక్క ఆర్థిక ఇబ్బందులు మరియు వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తక్షణం ఆర్ట్స్ కళాశాల వసతి గృహాలను ప్రారంభించాలని లేనిపక్షంలో భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి రమణయ్య, నగర నాయకులు మోహన్, ప్రవీణ్, అరుణ్ నాయక్, సాయి, అనిల్, తదితరులు పాల్గొన్నారు.