Header Top logo

Time is never the same కాలమెప్పుడూ ఒకలా ఉండదు

Time is never the same
కాలమెప్పుడూ ఒకలా ఉండదు

కనిపిస్తున్న కటిక దారిద్ర్యం
నాకంటే ఒకడుగు ముందుకేస్తుంటే
బ్రతుకు తెరువు పుస్తకంలో
తప్పొప్పుల అనుభవాలతో
చదివిన పేజీనే మరల మరల చదువుతుంటే
అందమైన జీవితం కోసం
అందలమెక్కాలన్న ఆశ
మొక్కలోనే కూలిపోతుంటే
తడబడుతున్న అడుగులతో
ఆవలి తీరం చేరాలనే
ఉబలాటం ఊపిరి తెగిపోతుంటే
ఖర్చులేని కలల నిచ్చెన కాక మరేమిటి మాకు

తొలి ఉషస్సుతో ఉదయిస్తుంది ఆశ
సర్దుకుంటూ సర్దుకుంటూ సందెవేళకొచ్చేసరికి
ఆవిరవుతూ అడియాశవుతుంది

కాలమెప్పుడూ ఒకలా ఉండదు
కాని ఏనాడో ఒకనాడు
నే కన్న కలలకు రూపాన్నైతే తెస్తా
అడుగంటిన ఆశలకు శ్వాసను అందిస్తూ..

Why man is changing today

మచ్చరాజమౌళి

దుబ్బాక , 9059637442

Leave A Reply

Your email address will not be published.

Breaking