Header Top logo

Naveen 26 Years Camera Journey నవీన్ ది ఇరవై ఆరేళ్ళ కెమెరా జర్నీ

Naveen The Twenty-Six Years Camera Journey

“జిందగీ” లో నవీన్ ది 26 ఏళ్ల కెమెరా జర్నీ…

అతను సమస్యలకు ఎదురెళ్లాడు. నేర్చుకోవాలనే తపన బతుకు బాటలో అడుగులు వేయించి గుర్తింపుని తీసుకొచ్చింది. ఒడిదుడుకులకు నవ్వుతూ వెల్కమ్ చెప్తూ, చేసే ప్రతి ప్రాజెక్ట్ కి మంచి పేరు రావాలని పరితపించే కెమెరామెన్ పొట్లూరి నవీన్ కుమార్ ను “జిందగీ” ముచ్చటించింది. తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ న్యూస్ ఛానెల్స్ లలో తన ప్రతిభతో శభాష్ అనిపించుకున్నారు నవీన్.

కుటుంబం..

రామానుజమ్మ-ప్రసాద్ రావు దంపతులకు 15 నవంబర్ 1974లో కృష్ణాజిల్లా నూజివీడు లో జన్మించాడు. పెరిగింది విజయవాడ. స్థిరపడింది హైదరాబాద్. 2002లో విజయవాడకు చెందిన వెంకటలక్ష్మీ తో వివాహం జరిగింది. వారికొక బాబు రుహీష్. ఆర్థిక సమస్యలతో నెట్టుకొచ్చే కుటుంబంలో పుట్టిన నవీన్ విజయవాడ ప్రభుత్వ ఐటీఐలో మెషినిస్ట్ కోర్సు చేశాడు. 1995లో ‘ఈనాడు’ దిన పత్రికలో మెషిన్ సెక్షన్ లో జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాడు అతను. బక్క పలుచగా ఉన్న నవీన్ కు ఆ జాబ్ రాలేదు. Naveen 26 Years Camera Journey

ఈటీవీలో జర్నీ..

ఒకటి దూరమైతే మరోటి దగ్గరవుతుంది అని నమ్మిన నవీన్ నిరాశ చెందలేదు. హైదరాబాద్ లో ఉండి న్యూ లైఫ్ ను స్టార్ట్ చేయడానికి జాబ్ కోసం అన్వేషించాడు. ‘ఈటీవీ’ లో అసిస్టెంట్ కెమెరామెన్ గా జర్నీ ప్రారంభించాడు. ఎనిమిది వందల నెల వేతనంతో ప్రారంభించి ఎంతో పేరున్న డైరెక్టర్స్, టెక్నిషియన్స్ తో వర్క్ చేస్తూ నేర్చుకునే అవకాశం ఇచ్చిన ‘ఈటీవీ’ తన “జిందగీ” లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్తాడు నవీన్.

Naveen 26 Years Camera Journey

టీవీ సీరియల్స్…

జీవితంలో బతుకు బాటలో ప్రయాణం చేయడానికి తనకు న్యూస్ కవరేజ్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ తో పాటు ఈటీవీ సీరియల్స్ ముఖ్య కారణమంటాడు పొట్లూరి నవీన్ కుమార్. పాడుతా తీయగా, సరిగమలు, హృదయాంజలి, కౌంట్ డౌన్, ఘుమఘుమలు వంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, భాగవతం, కళంకిత, లేడి డిటెక్టివ్, అనుబంధం, స్నేహ, సంఘర్షణ లాంటి ఫేమస్ సీరియల్స్ ను తీయడంలో ఎన్నో మెళుకువలు నేర్చుకున్నట్లు చెబుతాడు అతను. ప్రముఖ డైరెక్టర్ బాపు, పెద్ద వంశీ, రాజేందర్, సునీల్ వర్మ, అనిల్ కుమార్ లాంటి సినీ డైరెక్టర్ ల డైరెక్షన్ లో తీసిన సీరియల్స్ జీవితంలో మరిచి పోలేని తియ్యని జ్ఞాపకాలంటారు నవీన్. కెమెరామెన్ గా విభిన్న శైలిలో ఫ్రేమ్స్ పెట్టాలని నేర్చుకుంది రవీంద్ర, పి.ఆర్.కె.రాజు, మీర్, నాని అని గుర్తు చేసుకుంటాడు అతను.

Naveen 26 Years Camera Journey

బాపు డైరెక్షన్ లో ఫ్రేమింగ్..

సినీ డైరెక్టర్ బాపుతో తన జర్నీ మరిచి పోలేని మధుర జ్ఞాపకం అంటాడు నవీన్. ఒక్కో సీన్ ను ఎలా తీయాలో ప్రేమ్ ఎలా సెట్ చేయాలో మెళుకువలు నేర్చుకున్నట్లు చెబుతాడు అతను. పొద్దున లేవగానే సారధి స్టూడియో, రామోజీ ఫిలీం సిటీతో పాటు ఒరిస్సా, మహారాష్ట్ర, చెన్నై, ఢిల్లీలలో పని చెయ్యటం , బిల్ క్లింటన్ న్యూస్ కవరేజ్ అనుభవం ఎప్పటికీ నా లైఫ్ కు పనికి వస్తుందంటాడు కెమెరామెన్ నవీన్.

Naveen 26 Years Camera Journey

టీవీ 9 తో జర్నీ..

ఎనిమిది ఏళ్లు ఈటీవీలో పని చేసిన తాను 2003లో టీవీ9 న్యూస్ ఛానెల్ లో జాయిన్ అవ్వడంతో క్రొత్త ప్రపంచాన్ని చూశానని చెబుతాడు నవీన్. ఈటీవీలో ఎంత కాలం పని చేసిన అది నేర్చుకునే ఇన్ స్ట్యూట్ గా ఉపయోగించుకోవచ్చన్నారు. సీఇవో రవి ప్రకాష్ గారితో జర్నీ లో కిక్ ఎలా ఉంటుందో చూశానంటారు. రవి ప్రకాష్ ఇంటార్వ్యూ అంటెనే డైరెక్ట్ క్వశ్వన్స్.. నిలదీతలు తనకు ఎంతో నచ్ఛేవని గుర్తు చేసుకుంటాడు నవీన్. Naveen 26 Years Camera Journey

నక్సలైట్ల సభ జనంతో..

నక్సలైట్ల గురించి పత్రికలో వార్తలు చదివానని.. టీవీలో వార్తలు చూశానని సీనియర్ కెమెరామెన్ నవీన్ అన్నారు. అయితే.. ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ హయంలో ప్రభుత్వంతో చర్చలు జరుపడానికి గుంటూరు జిల్లా గుత్తికొండ బిళం వద్ద అడవుల నుంచి బయటకు వచ్చి నిర్వహించిన సభలో జనంను చూసి ఆశ్చర్య పోయానంటారు అతను. నిరుపేదలు, కూలీలు పెద్ద సంఖ్యలో స్వయంగా సభకు హాజరు కావడం మరిచి పోలేని అనుభూతి అంటున్నారు నవీన్. అడవులలో ఉండి పోరాటాలు చేసే నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసి పోరాటాలు చేస్తే బాగుంటుందన్నారు.

మీడియా రంగంలో..

‘ఐ న్యూస్’ లో సీఇవో రాజశేఖర్ గారితో జర్నీ ప్రోగ్రామ్స్ కి టైటిల్స్ ఎలా పెట్టాలో, ప్రోమోస్ ఎలా చేయాలో నేర్చుకునేలా చేసింది అన్నారు. స్టూడియోస్ లైటింగ్ తో పాటు తెలుగు న్యూస్ చానెల్స్ లోనే మొదటిసారిగా ట్రాక్ అండ్ ట్రాలీ, క్రేన్ తో లైవ్ లో న్యూస్ బులెటిన్ నడిపించడం తనకు మంచి పేరుని తీసుకొచ్చాయి అన్నారు.

తిరుపతిలో క్యాప్ లతో..

సినీ హీరో చిరంజీవి తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ ప్రకటించిన సందర్భంగా తాను ‘ఐ న్యూస్’ క్యాప్ లతో ఛానల్ పబ్లిసిటీ చెయ్యటం, ప్రొడ్యూసర్ గా చేసిన ఐ న్యూస్ ప్రోమోస్, ప్రోగ్రామ్స్ మంచి గుర్తింపుని తీసుకొచ్చాయని, తాను చేసిన స్టూడియోస్ లైటింగ్ చూసి ఫారిన్ కెమరామెన్ నిక్ అభినందించటంతో సీఇవో రాజశేఖర్ గారితో పాటు చైర్మన్ వాసు గారు తనను అభినందించారన్నారు. ఐ న్యూస్ లో కెమెరా డిపార్ట్మెంట్ హెడ్ గా చేస్తున్నప్పుడు జీతాలు ఇవ్వడం కష్టం కావడంతో “స్టూడియో ఎన్” లో కెమెరా డిపార్ట్మెంట్ హెడ్ గా చేరానన్నారు. ఒకే రోజు ఒకే ఆన్లైన్ సెటప్ తో చంద్రబాబు నాయుడు బహిరంగ సభలకు సంబంధించి ఆరు లైవ్ లు ఆరు ప్రదేశాలలో చేయడం మరిచి పోలేనిదన్నారు. ఎంతో కష్టంతో కూడుకున్నదన్నారు.

వీ6 న్యూస్ తో జర్నీ..

2012లో వీ6 న్యూస్ లో చేరిన తరువాత సీఇవో అంకం రవి సహాకారంతో వినూత్న ప్రోగ్రాంలు చేశానంటున్నారు నవీన్. కత్తి కార్తీక షో.., జానపదం, తీన్మార్, ఛానల్ ప్రోమోస్, వినాయక చవితి, బతుకమ్మ, బోనాలు పండుగల సాంగ్స్ తీయడంతో కోట్లలో వ్యూస్ రావడంతో తనకు మంచి పేరు తీసుకు వచ్చాయన్నారు. మేడారం సమ్మక్క, సారక్క స్టోరీస్ తో పాటు మేడారం జాతరలో చేసిన డ్రోన్ షాట్స్ ‘వీ6’ యాజమాన్యం నుండి అప్రిషియట్ చేస్తూ లెటర్ అందుకునేల చేశాయి అన్నారు. Naveen 26 Years Camera Journey

‘ఎన్ టీవీ’ లో సీనియర్ ప్రోగ్రాం ప్రొడ్యూసర్ గా

2018 లో సీఇవో రాజశేఖర్ అందించిన ప్రోత్సాహంతో ‘ఎన్ టీవీ’ లో సీనియర్ ప్రోగ్రాం ప్రొడ్యూసర్ గా పోల్ యాత్ర, ఇదీ జీవితం, పొలిటికల్ ప్రోగ్రామ్స్ , లీడర్, సినిమా ఆర్టిస్ట్స్ తో పండుగ స్పెషల్స్ వంటి సంస్థకు పేరు తెచ్చిన ప్రోగ్రామ్స్ చేసే ఛాన్స్ వచ్చిందన్నారు. అలాగే ఛత్తీస్గడ్ లోని సీఆర్పీఎఫ్ బెటాలియన్ తో చేసిన ప్రోగ్రామ్ వలన వారి కష్టాలు, అనుభవాలు తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు.యాడ్ మేకర్ గా కూడా యాడ్స్ చేసిన నవీన్ తాను డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా చేసిన ‘‘ఊరెళ్ళిపోతా మామ’’ సినిమా విడుదలకు సిద్దంగా ఉందన్నారు.

ముగ్గురు సీఇవోల వద్ద పని చేసి..

టీవీ 9 సీఇవో రవి ప్రకాష్, ఐ న్యూస్ సీఇవో రాజశేఖర్, వీ6 న్యూస్ సీఇవో రవి అంకం గారితో పని చేసి వారి మన్ననలు పొందడం జీవితంలో మరిచి పోనంటున్నారు నవీన్. తన “జిందగీ” లో మంచి గుర్తింపు, పేరు తీసుకొచ్చిన ఐన్యూస్, వీ6, ఎన్ టీవీ చానెల్స్ లో నాకు సహకరించి నా ఎదుగుదలకు తోడ్పడిన ప్రతి ఒక్క కెమెరామెన్ కి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అన్నారు. అలాగే తాను చేసిన ప్రోగ్రామ్స్, ప్రోమోస్, సాంగ్స్ సక్సెస్ కి తన ఎడిటర్స్ వెంకట్ (ఎన్ టీవీ), రమేష్ (ఎన్ టీవీ) , ఉదయ్ (వి6) సహకారం మరువలేనిదన్నారు.

Naveen 26 Years Camera Journey

ఆల్ ఇన్ వన్ గా..

ఇరవై ఆరు సంవత్సరాలలో ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ విభాగాలలో పని చేస్తూ నేర్చుకోవడం, కొంతమందికైనా నేర్పించడం సంతోషంగా ఉందంటున్నారు సీనియర్ కెమెరామెన్ నవీన్. ప్రోగ్రామ్ డైరెక్టర్ గా, ప్రోమోస్ డైరెక్టర్ గా, యాడ్ మేకర్ గా, ఆన్లైన్ ప్రోడ్యుసర్ గా, సెట్ డిజైనర్ గా, కెమెరా డిపార్ట్మెంట్ హెడ్ గా చేసిన తాను ఏ పనైనా ఓర్పుతో ఇష్టంగా చెయ్యటం, ఇష్టంగా నేర్చుకోవటం, అందరూ ఇష్టపడేలా, మంచిపేరు తెచ్చే ప్రాజెక్ట్స్ చేస్తూ జీవించటం ఇష్టం అని “జిందగీ” లో చెయ్యాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది అంటూ నవ్వుతూ చెప్పారు నవీన్ పొట్లూరి.

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

1 Comment
  1. Sujatha says

    Very inspiring story of u sir

Leave A Reply

Your email address will not be published.

Breaking