AP 39TV 16 ఫిబ్రవరి 2021:
చిన్న వర్షం వస్తే నడవడానికి కూడా వీలులేని పరిస్థితి.బురద గుంతలు నడుమ అడుగులో అడుగు వేస్తూ పాదచారులు.నీటి గుంత లోతు తెలియక జాగ్రత్తగా నడుపుతూ వాహనదారులు.ఇదీ మొన్నటి వరకు జేఎన్టీయూ సమీపంలోని సుపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రోడ్ పరిస్థితి.విశాలంగా రోడ్ ఉన్నా వాటి అభిరుద్ది గురించి నాటి టీడీపీ నేతలు పట్టించుకున్న పాపాన పోలేదు.చిన్నపాటి వర్షానికే నడవలేని పరిస్థితి ఏర్పడి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తో పాటు పక్కనే వున్న కె ఎస్ ఆర్ మహిళా కళాశాల విద్యార్థినులు సిబ్బంది తో పాటు ఆ రహదారిలో పయనించే ప్రజలు అనేక ఏళ్ళ పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అయితే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి 1.40 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి 4 నెలల కాలంలోనే నాలుగు వరసల రహదారిగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రోడ్ ను తీర్చిదిద్దారు.దీనితో నిన్న మొన్నటి వరకు గుంతల మయంగా ఉన్న రోడ్ నేడు 4 వరసల రహదారిగా మారడంతో వాహనదారులు రయ్ రయ్ మంటూ ముందుకు సాగుతున్నారు.