Header Top logo

నిరుద్యోగులను మభ్యపెడుతున్న ప్రభుత్వం: హేమలత బాయి

AP 39 TV 25ఫిబ్రవరి 2021:

సేవాలాల్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రమావత్ చందు నాయక్  ఆదేశాల మేరకు సేవాలాల్ సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో సేవాలాల్ సేవాసమితి ముదిగుబ్బ నియోజవర్గం అధ్యక్షురాలు హేమలత బాయి మాట్లాడుతూ… అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేవలం సచివాలయ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశాడన్నారు. ప్రతి సంవత్సరం ఏపీపీఎస్సీ అకడమిక్ క్యాలండర్ విడుదల చేసి దాని ద్వారా గ్రూప్ 1,గ్రూప్ 2,గ్రూప్ 3,గ్రూప్ 4,ఎస్సై, కానిస్టేబుల్ మరియు ఇతర శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇంతవరకు క్యాలండర్ విడుదల చేయకుండా నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిరుద్యోగులను మభ్యపెడుతున్నారన్నారు.ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ లక్షలాది రూపాయలు కోచింగ్ లకు ఖర్చు చేస్తూ వయోపరిమితి దాటి పెళ్లి చేసుకోకుండా నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నారని నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళ చేస్తామని సేవాలాల్ సేవాసమితి హేమలత బాయి  ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking