AP 39 TV 25ఫిబ్రవరి 2021:
ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రాలలోకెల్లా భారీ చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 17వ శతాబ్దం నాటి వాతావరణంలో పిరీడ్ మూవీగా నిర్మిస్తున్నారు. కోట్లు వెచ్చించి నాటి కాలాన్ని ప్రతిబింబించే వివిధ సెట్లను వేస్తున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగగా విభిన్నమైన గెటప్పులో కనిపిస్తాడట.ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను, సినిమా టైటిల్ ను కలిపి మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ 11న రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.