AP 39 TV 25ఫిబ్రవరి 2021:
కనేకల్: మండల పరిధిలోని ఎన్. హనుమాపురం గ్రామంలో నూతన సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీ నాయకులు N. జయ రామ్ చౌదరి నూతన సర్పంచ్ గా, వైస్ సర్పంచ్ గా N. సురేష్, పంచాయతీ కార్యదర్శి K.L. శ్రీ రాములు మరియు గ్రామ ప్రజల, పెద్దలు, బంధుమిత్రులు, విలేజ్ రెవెన్యూ అధికారి V. గంగన్న ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ,పెద్దలకు బంధుమిత్రులకు అభినందనలు తెలియజేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు వెన్నుండి నడుస్తూ గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్లడానికి నా వంతు కృషి ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు. నా అభివృద్ధిని చూసి ముందు రాబోయే సర్పంచులు కు ఆదర్శప్రాయుడు గా నిలుస్తానని విలేకర్ల సమావేశంలో తెలియజేశారు. మా గ్రామంలో నీటి సమస్య ఎక్కువ ఉందని వాటి సమస్య కూడా త్వరలో తీరుస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు కట్టు కమ్మ, టి. శంకరప్ప, N.జయమ్మ,N. సురేష్, బి .లక్ష్మి దేవి, కే. తిప్పయ్య,H. ఈశ్వరప్ప, బి .లక్ష్మి, బోయ లక్ష్మి, v. రాఘవేంద్ర , గ్రామ పెద్దలు, ప్రజలు, బంధుమిత్రులు,సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.