The gill-snake parable తొండ-పాము నీతి కథ
The gill-snake parable
కరోనా-తొండ-పాము నీతి కథ
ఒక తొండ పాముతో “నేను చెప్పినట్టు చేస్తే, నువ్వు కాటేసిన మనిషి చావడు, కానీ నేను కరిచిన మనిషి చస్తాడు” అంది.
“అదెలా..?” అనడిగింది పాము.
“నేను చెప్పినట్టు చెయ్యి” అని,
ఒక పొలంలో పనిచేసుకునే రైతుని “వెనుక నుండి కాటెయ్యి” అంది తొండ..
పాము అలానే కాటేసింది, వెంటనే ఆయన రెండు కాళ్ల మద్య నుంచి ముందుకి తొండ పరిగెత్తిపొయ్యిందంట.
నన్ను కరిసచింది తొండే కదా అని ధైర్యం తో గాయానికి ఆకుపసురేదో పూసుకొని తిరిగి పనిలో పడ్డాడు ఆ రైతు.
మళ్ళీ ఇంకో పొలంలో “రైతుని నేను కరుస్తాను,
నువ్వు ఆయన కాళ్ల మధ్య నుంచి వేళ్ళు” అని..
తొండ కరిచింది.. పాము ఆయన కాళ్ల మధ్య నుంచి సర్రన పాకి పోయింది. పాముని చూసిన రైతు, కంగారుతో తనని పామే కాటేసిందని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు భయంతో..
భయం ఎంత భయంకరమైందో తెలియచెప్పే కధ ఇది..
కాబట్టి కరోన విషయంలో పేపర్లు, టీవీలు, వాట్సాప్ లు, ఫేసుబుక్కు లు మిగతా సామాజిక మాధ్యమాల్లో వాటిలో వచ్చేవి, రాసేవి అదే పనిగా మనసులో పెట్టుకొని, భయపడుతూ ఉంటే చిన్న చిన్న విషయాలకు కూడా మనం బాధపడాల్సి వస్తుంది.
ధైర్యంగా ఉండండి కానీ జాగ్రత్తతో మసలుకోండి. మీ ధైర్యమే మీకు, మనందరికి కొండంతా బలం.
మాస్కు ధరించండి..
సామాజిక దూరం పాటించండి..
తరచుగా చేతులు శుభ్రపరుచుకోండి..
ఇంట్లోనే ఉండండి.. అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకండి.
మీరు జాగ్రత్తగా ఉండి.. మీ తోటివారిని జాగ్రత్తగా ఉంచండి.
సేకరణ.. అల్లూరి సౌజన్య