గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు: డీకే అరుణ
- కాంగ్రెస్ చాలా తప్పులు చేసింది
- ఓడిపోయే నేతలకు టికెట్లు ఇచ్చారు
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు
కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు చేతులారా అనేక తప్పులు చేశారని తెలంగాణ బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. గత ఎన్నికలలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అతి పెద్ద తప్పు అని అన్నారు. టికెట్లు ఇవ్వడంలో కూడా తప్పులు చేశారని… ఓడిపోయే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారని చెప్పారు. తెలంగాణ ఒక చిన్న రాష్ట్రమని… ఎన్నికలలో ఏ నాయకుడు గెలుస్తాడు? ఏ నాయుకుడు ఓడిపోతాడు? అనే విషయం అందరికీ తెలుసని అన్నారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని తెలిపారు.
బీజేపీ ఒక జాతీయ పార్టీ అని… ఇక్కడ ఒక నాయకుడు గొప్ప, మరో నాయకుడు తక్కువ అనే తేడా ఉండదని చెప్పారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవి లభించనందుకు తాను అసంతృప్తిగా లేనని అన్నారు. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Tags: DK Aruna, BJP, Congress, Chandrababu, Telugudesam