Header Top logo

మీడియా స్వేచ్ఛ.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 48గంటల నిరసన దీక్ష 22న..

  • ఏపీ హైకోర్టు తీర్పుపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి
  • జర్నలిజంపై సంకెళ్ల విముక్తికోసం పోరాడుతాం
  • వార్తలు ఆపమని హక్కు కోర్టుకు లేదు
  • సుప్రీం కోర్టు కేంద్రం జోక్యం చేసుకుని న్యాయవ్యవస్థ విలువలు కాపాడాలి: మచ్చా రామలింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ (A.P.J.D.S)

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది అన్ని వ్యవస్థలు ప్రజాస్వామ్యంలో భాగమే అన్ని వ్యవస్థలకు రాజ్యాంగంలో ప్రత్యేక అధికారాలు డాక్టర్ అంబేద్కర్ గారు స్పష్టంగా రాయడం జరిగింది కాకపోతే కొన్ని వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి స్వయంప్రతిపత్తిగా పనిచేయడం జరుగుతుంది అలాంటిదే న్యాయవ్యవస్థ, న్యాయస్థానం జడ్జిలు..

ఇటీవల అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి ఏసీబీ ఎఫ్.ఐ.ఆర్ కొంతమంది నాయకుల పై నమోదు చేయడాన్ని స్టే ఇస్తూ పత్రికలు మీడియా ఆ వార్తలు రాయకూడదని చెప్పడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం జర్నలిస్టుగా మాకు ఆవేదన కలుగుతుంది. ఆ కేసులో ఎఫ్.ఐ.ఆర్ రాయకూడదు, చూపించకూడదు అంటే మీడియా స్వేచ్ఛలోకి న్యాయస్థానం చొరబడిన నట్లు భావించాల్సివస్తుందని మచ్చా రామలింగారెడ్డి అన్నారు.

నిజానికి రాజ్యాంగంలో కోర్టులు రెండు అంశాల్లో మాత్రమే కలుగుచేసుకోవాలిని స్పష్టంగా రాజ్యాంగంలో ఉంది అందులో డివియేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, డివియేషన్ ఆఫ్ లా జరిగినప్పుడు మాత్రమే న్యాయస్థానాలు కలుగచేసుకోవాలని ఉందని కానీ ఇటీవల కాలంలో అన్ని విషయాల్లోనూ న్యాయస్థానాలు కలుగజేసుకోవటం ఆందోళన కలిగించే అంశమని మచ్చా రామలింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఇచ్చిన తీర్పు అందరికీ సమానంగా ఉండాలని పేద, ధనిక తేడా లేకుండా ఉండాలని మచ్చా అన్నారు.

ఒక్క అమరావతి భూకుంభకోణం ఎఫ్.ఐ.ఆర్ ని మాత్రమే వార్తలు రాయడం అంటే ఎలా అని అన్ని కేసుల్లోనూ ఇలాగే తీర్పు ఇస్తే జర్నలిజం పరిస్థితి ఏంటి మీడియా స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది ఆలోచించాలని అన్నారు.

రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, కేంద్రం జోక్యం చేసుకొని ఏపీ హైకోర్టు తీర్పుని రద్దు చేస్తూ మీడియా స్వేచ్ఛను కాపాడాలని భవిష్యత్తులో ఇటువంటి తీర్పులు రాకుండా ప్రజాస్వామ్యంలో మీడియాకు స్వేచ్ఛ ఇవ్వాలని మచ్చా రామలింగారెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వెంటనే పునఃసమీక్షించాలని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని జర్నలిస్టులు రోడ్లెక్కకుండా చూడాల్సిన బాధ్యత ఏపీ హైకోర్టు న్యాయస్థానందే అని మచ్చ రామలింగారెడ్డి అన్నారు.

?ఈ రోజు అనంతపురం నగరంలోని R&B గెస్ట్ హౌస్ నందు జరిగిన ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించాలని పోరాడాలని నిర్ణయించారు.

?ఈనెల 22వ తారీఖున అనంతపురం నగరంలోని పాత ఆర్డీవో కార్యాలయం ఎదురుగా మీడియా స్వేచ్ఛ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 48గంటల నిరసన దీక్ష రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి కూర్చుంటారని జర్నలిస్టులు అందరూ సంఘీభావం తెలపాలని పాల్గొనాలని జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ విజ్ఞప్తి చేసింది.

?సమావేశానికి ఏపీ జర్నలిజం సొసైటీ నగర అధ్యక్షులు శ్రవణ్ అధ్యక్షత వహించారు, సమావేశంలో సీనియర్ జర్నలిస్టు ఉధండం చంద్రశేఖర్, విజయరాజు, బాలు, కుల్లాయిస్వామి, సాకే జానీ, షాకీర్, నాయక్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

?A.P JOURNALIST DEVELOPMENT SOCIETY, ANANTAPURAMU DIST?

Leave A Reply

Your email address will not be published.

Breaking