Header Top logo

ఒకేసారి 9 సినీమాలు ప్రారంభించిన తారకరత్న

గిన్నిస్ బుక్ రికార్డు సాధించి..

హైదారబాద్ : 1983 ఫిబ్రవరి 22 (40) జన్మించిన తారక రత్న నందమూరి వారసుడు గా 2002 లో హీరో గా తారక రత్న ఎంట్రీ ఇచ్చారు. ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభించి గిన్నిస్ రికార్డ్ కెక్కిన తారక రత్న ఇక లేరానే వార్తను అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

ఒకే రోజు 9 సినిమా ల ప్రారంభం ప్రపంచం లో మారే హీరో కి లేని అరుదైన రికార్డ్ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 23 చిత్రాల్లో నటించిన తారకరత్నకు మంచి భవిష్యత్ ఉండేది. ఇప్పటికే షూటింగ్ దశలో  మరో రెండు చిత్రాలు ఉన్నాయి. రిలీజ్ కు  మిస్టర్ తారక్ రెడీగా ఉంది.

లాస్ట్ ఇయర్ 9 hours అనే వెబ్ సిరీస్ లో నటించిన తారక రత్న ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఫ్యాషన్ డిజైనర్ ఆలేఖ్య రెడ్డి ని ప్రేమ వివాహం చేసుకున్న తారక రత్న కూతురు పేరు నిష్క గా పెట్టుకున్నారు.

ఒకటో నెంబర్ కుర్రాడు, యువ రత్న, తారక్, భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రి, భక్త సిరియలు, సారధి చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు  తారక రత్న. 2009 లో అమరావతి చిత్రానికి ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking