Header Top logo

ఛత్రపతి శివాజీ జీవిత ప్రస్థానం

ఛత్రపతి శివాజీ జీవిత ప్రస్థానం

 1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని కున్భీ (బీసీ )కులంలో పుట్టిన శివాజీ ఏ సింహాసన వారసత్వం లేకుండా స్వశక్తితో ఒక రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు. @మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన శివాజీకి పట్టాభిషేకం చెయ్యడానికి ఏ బ్రాహ్మణుడు ముందుకు రాలేదు, కారణం శివాజీ శూద్రుడు కాబట్టి.

హిందు ధర్మశాస్త్రాల ప్రకారం బ్రాహ్మణులకి, క్షత్రియులకి మాత్రమే రాజయ్యే హక్కు ఉంది. దాంతో శివాజీ పట్టాభిషేక కార్యక్రమానికి కాశీ నుండి అప్పుడు గంగాభట్ అనే బ్రహ్మాణున్ని అతని బరువుకు సరితూగే బంగారం ఇస్తానని ఒప్పించి రాజ్యాభిషేకం చెయ్యడానికి పిలిపిస్తే కాలిబ్రొటన వేలుతో గంగాభటుడు శివాజీ నుదుటకు తిలకం దిద్ది రాజ్యాభిషేకం చేస్తాడు.

వ్యక్తిగతంగా శివాజీకి బ్రాహ్మణులు అందరు వ్యతిరేకం కాకపోవచ్చు. కానీ బ్రాహ్మణ ధర్మం కులం పేరిట ఒక మహా చక్రవర్తిని అవమానించింది. శూద్రులు రాజులు కాకూడదని ధర్మం విధించింది. ముసల్మాన్ రాజు కావచ్చు కానీ శూద్రుడు కాలేడు. మహా చక్రవర్తి ఐన శివాజీని జీవితాంతం వెంటాడిన  రాహ్మణవాదం ఆ తర్వాత తన పబ్బం గడుపుకొనుటకు శివాజీని ముస్లిం వ్యతిరేకిగా కరుడుగట్టిన హిందూ మతాభిమానిగా చిత్రించి చరిత్రని వక్రీకరించింది.

భవానీ మాత ఖడ్గం ప్రసాదించినట్లు మూఢవిశ్వాసాన్ని ప్రచారం చేసారు. నిజానికి అది అప్పుడు పోర్చుగల్ లో తయారు చేయించిన కత్తి. శివాజీ వాడిన ఆ ఖడ్గం ప్రస్తుతం సతారా మ్యూజియంలో ఉంది. దానిపై పోర్చుగీస్ లిపి ఉంది.

ఛత్రపతి బ్రాహ్మణ మతానికి లోబడి పని చేసిండు. అవలంభిoచిండు. కానీ మత దురాభిమాని కాదు. అప్పటి మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకంగా స్వరాజ్య స్థాపన కోసం పని చేసిండే తప్ప ముస్లిములకు వ్యతిరేకంగా కాదు. శివాజీని ముస్లిం మత వ్యతిరేకిగా ప్రచారం చేసి తప్పుడు జాతీయ వాదానికి ప్రతీకగా నిలబెట్టారు.

శివాజీ ముస్లీం వ్యతిరేకి ఐతే తన సైన్యంలో మూడవ వంతు ముస్లీములెలా ఉంటారు? @శివాజి ముస్లిం వ్యతిరేకి అయితే శివాజీ సాయుధ దళాలలో ముఖ్యమైన ఆయధాగార అధిపతిగా ఒక ముస్లింని నమ్మి ఇబ్రహీం ఖాన్ ను ఎలా నియమించుకుంటాడు?

శివాజీ నౌకాదళాధిపతి దౌలత్ ఖాన్ ఒక ముస్లిం. శివాజీ అంగరక్షకుడు మదాని మెహతర్ ఒక ముస్లిం. ఈ మదాని మెహతర్ శివాజీని ఔరంగజేబ్ ఆగ్రాలో బంధించినపుడు మారు వేషంలో వెల్లి తన ప్రాణాలొడ్డి శివాజీ తప్పించుకొనుటకు సాయం చేసాడు. శివాజీకి సన్నిహితుడు, విదేశి వ్వవహరాల మంత్రి ముల్లా హైదర్ ఒక ముస్లిం.

సలేది యుద్దం తర్వాత ఔరంగజేబు సైన్యాధికార్లతో సత్సంబంధాల కోసం శివాజీ తన తరపున దూతగా కాజీ హైదర్ అనే ముస్లీముని పంపిస్తాడు. శివాజీ తన రాజభవనం ముందర ప్రార్థన కొరకు దర్గాని కట్టించాడు. అంత గొప్ప ఈ దేశ బహుజన మూలవాసి చక్రవర్తి శివాజీని ఈ రోజు బ్రహ్మానీకరణం చేసీ మనల్ని మోసం చేస్తుంటే దాన్ని తెల్సుకోకుండా మతం మత్తులో అగ్రవర్ణ ఆధిపత్య బ్రాహ్మణీయ మాయాజాలంలో నిండా మునిగి తెలవిలేక పావులా బీసీలు మారడం విచారకరం.

ఛత్రపతి శివాజీ ఒక శూద్రుడు ( ఓబిసి) కావున బ్రాహ్మణిజం అoతగా అవమానపర్చి చివరికి హత్య చేస్తే ఈ రోజు అదే బీసీ సామాజిక వర్గం బ్రహ్మాణవాదాన్ని తమ భుజస్కందాలపై మోస్తుంది. కాబట్టి బీసీలు ఈ అగ్రవర్ణ కుట్రల్ని గ్రహించి తిప్పికొట్టాలి. జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, పారిశ్రామిక, వ్యాపార, రాజకీయ రంగాలలో అవకాశాలు కల్పిస్తున్నారా లేదా గ్రహించాలి.

ఈ దేశంలో తొలిసారిగా 50%. రిజర్వేషన్స్ కల్పించిన శివాజీ మనుమడైన ఛత్రపతి సాహుమహరాజ్ ఇచ్చిన “ఎవరి జనాభా ఎంతో, వారి వాటా అంత” అనే నినాధం స్పూర్తిగా. బుద్దుడు చెప్పిన బహుజనుల హితం కోరే బహుజనుల సుఖం కోరే బహుజన రాజ్య నిర్మాణం దిశగా

బాబా సాహెబ్ అంబేడ్కర్ బాటలో అడుగు వేయడంలో భాగంగా ఊరూరా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలని ఘనంగా నిర్వహిద్ధాం. అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆలోచనా విధానాలను ప్రజల్లోకి తీసుకెలదాం.

జై భీమ్… జై జై భీమ్…

– సోషల్ మీడియా సౌజన్యంతో..

Leave A Reply

Your email address will not be published.

Breaking