Header Top logo

Sudha Bhardwaj’s life in jail జైల్ లో సుధా భరధ్వాజ్ జీవితం

Sudha Bhardwaj's life in jail

జైల్ లో సుధా భరధ్వాజ్ జీవితం

ఆమె పుట్టుకతో అమెరికన్ పౌరురాలు. పుట్టబోయే బిడ్డల్ని అమెరికన్ పౌరులుగా కనాలని కడుపులో బిడ్డతో అమెరికా గడ్డమీద కాలుబెట్టిన వారి గురించి ఎరుగుదును. కానీ ఆమె పుట్టుకతో వచ్చిన అమెరికన్ పౌరసత్వాన్ని కాలదన్ని ఇండియా పౌరసత్వం స్వీకరించి ఇండియాలోనే వుండిపోయింది. ప్రముఖ విద్యాసంస్థగా విదేశాల్లోనూ గుర్తింపు వున్న IIT నుండీ పట్టా పొందింది.

ఆదివాసీల హక్కుల కోసం

IITలో చదువుతుండగానే చత్తిస్‌గడ్ లోని ఆదివాసీల హక్కుల కోసం చత్తిస్‌ఘర్ ముక్తి మోర్చా అనే సంస్థ ద్వారా పోరాడింది. అడవితల్లి బిడ్డల కోసం వారివెంటే వుంటూ ఇప్పటి అధికార బీజేపీతోనే కాదు, అప్పటి కాంగ్రెసుతోనూ, కార్పొరేట్ శక్తులతోనూ తలపడింది. ఆ విధంగా అధికార దోపిడీ శక్తులకు ఆమె టార్గెట్‌గా మారింది. చత్తిస్‌ఘర్ ముక్తిమోర్చా స్థాపకుడు శంకర్ గుహ నియోగిని కిరాయి మనుషులతో చంపించినా సుధా భరధ్వాజ్ వెనకడుగు వేయలేదు. కార్మికుల హక్కుల కోసం పోరాడడం మానలేదు. Sudha Bhardwaj’s life in jail

ఇంకా జైల్లోనే..

ఆమెను సంబోదిస్తూ ఒక మావోయిస్టు రాశాడని చెబుతున్న ఉత్తరంలో “కామ్రేడ్ సుధా భరధ్వాజ్..” అని వుందట. దాన్ని పట్టుకొని అర్నాబ్ అనే కుక్క రిపబ్లిక్ టీవీలో మొరిగితే, ఆ తర్వాత రెండ్రోజులకే ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆగస్టు 26, 2018న అరెస్టైన ఈమె బెయిల్ తిరస్కరింపబడుతూ ఇంకా జైల్లోనే వుంది. ఆమె అరెస్టు కాబడిన ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె చిత్రపటాన్ని ప్రదర్శించి హార్వర్డ్ యూనివర్శిటీ గౌరవం ప్రకటించింది. Sudha Bhardwaj’s life in jail

అవసరంలో వున్న వాళ్ళకు కాసిన్ని డబ్బులివ్వడం, ఆకలితో వున్నవాడికి పట్టెడన్నం పెట్టడం అధికార రాబందుల కళ్ళు పడనంతవరకే సుళువైన కీర్తి గడించే మార్గాలు. సుధా భరధ్వాజ్, వరవరరావు లాంటి అమాయకులకు ఇది అర్థం కాక జీవితాన్నంతా ప్రజలకోసం ధారపోస్తారు.

– Prasad charasala

Leave A Reply

Your email address will not be published.

Breaking