Introduction to Cine Artist Silk Smitha సిని ఆర్టిస్ట్ సిల్క్ స్మిత పరిచయం
Introduction to Cine Artist Silk Smitha
సిని ఆర్టిస్ట్ సిల్క్ స్మిత పరిచయం
సిల్క్ స్మిత చెరిగిపోని ఓ రంగుల స్వప్నం.!! సిల్క్ స్మిత ఓ సమ్మోహనాస్త్రం..!! సిల్క్ అంటే కుర్ర కారుకు కిర్రెక్కాల్సిందే…!! సిల్క్ అంటే సౌత్ సినిమా కమర్షియాలిటికి కేరాఫ్..!! సిల్క్ లేకపోతే సినిమాలు కొనమన్న బయ్యర్లు..!!
నిరుపేద కుటుంబంలో
సిల్క్ స్మిత అసలు పేరు “విజయలక్ష్మి” పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో 1960, డిసెంబరు 2న జన్మించింది. 4వ తరగతితో చదువుమానేసి,సినీనటి కావాలని మద్రాసు రైలెక్కేసింది. సినిమాల్లో హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించింది. అయితే హీరోయిన్ పాత్రలు రాక, వ్యాంప్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఐటెం సాంగ్స్ చేసింది. సినిమాల్లో సిల్క్ స్మిత పేరుతో ఓ వెలుగు వెలిగింది. సిల్క్ స్మిత మొదటి చిత్రం తమిళంలో వండి చక్రం (బండి చక్రం). 1979లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్. అదే పేరుతో దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది.
సిల్క్ లేకపోతే సినిమాలు కొనం
1980..1990 నిషా కళ్ళతో ఓ దశాబ్దకాలం కుర్రకారు గుండెల్లోగుబులు రేపింది. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలతో కలిపి 200లకు పైగా సినిమాల్లో నటించింది. ఓ దశలో ‘ సిల్క్ లేకపోతే మేం సినిమాలు కొనమని’ బయ్యర్లు మొండికేశారంటే సిల్క్ పట్ల ప్రేక్షకుల అభిమానాన్ని అంచనా వెయ్యొచ్చు.
బావలు సయ్యా సాంగ్ ఐటం
“బావలు సయ్యా”..! అంటూ సిల్క్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు తెరమీద పూలు, చిల్లర పైసలు చెల్లి నానా హడావుడి చేసేవారు ప్రేక్షకులు. చివరకు సినిమాల్లోని హీరోలు కూడా ఐటమ్ సాంగ్స్ లో సిల్క్ తో స్టెప్పులు వేయక తప్పేది కాదు. ఔట్ డోర్ షూటింగుల్లో సిల్క్ వుంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి తలెత్తేది. జనం చుట్టుముట్టి సిల్క్ ను నానాయాగీ చేసేవారు. అందుకే సాధ్యమైనంత వరకు ఇండోర్ లోనే సిల్క్ షూటింగ్ పూర్తి చేసేవారు. తన 17 సంవత్సరాల కెరీర్‌లో, ఆమె 450 చిత్రాలలో నటించింది. Introduction to Cine Artist Silk Smitha
చక్కని నటి…!!
నిజానికి సిల్క్ స్మిత చక్కని నటి. అయితే సినీపరిశ్రమ మాత్రం ఆమెలో ఓ ఐటమ్ నే చూశారు. వసంత కోకిల, సీతాకోకచిలుక, ఖైదీ 786,ఆదిత్య 369 తదితర చిత్రాల్లో సిల్క్పెర్ఫార్మెన్స్ విస్తుపరిచింది. సిల్క్ లో ఇంత ప్రతిభ, పెర్ఫార్మెన్స్ వుందా ? అని ఇండస్ట్రీ లో చర్చజరిగింది. అయినా సిల్క్ కు పెర్ఫార్మెన్స్ పాత్రలు ఇవ్వలేదు. ఐటమ్ గానే తన కెరీర్ ను కొనసాగించక తప్పలేదు. అప్పటికే ఐటమ్ గర్ల్స్ గా జ్యోతిలక్ష్మి, జయమాలిని లాంటి వాళ్లు నిలదొక్కుకొని వున్నారు. అయినా సిల్క్ వాళ్ళందర్నీ వెనక్కు నెట్టి ముందు వరుసలో నిల్చొంది.
నిర్మాతగా డిజాస్టర్…!!
ఐటమ్ గర్ల్ గా కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో సొంతం సినిమా తీసి చేతులు కార్చుకుంది. ఆర్ధికంగా బాగా నష్ట పోయింది. అప్పులపాలైంది. దీనికి తోడు ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరో మోసం చెయ్యడంతో మానసికంగా కుంగిపోయి, మద్యానికి బానిసైంది. చివరకు ఆత్మహత్య చేసుకుంది.
డర్టీ పిక్చర్…!! సిల్క్ స్మిత జీవితం నేపథ్యంతో హిందీలో తీసిన డర్టీపిక్చర్ సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఈ సినిమాలో సిల్క్ పాత్ర వేసిన నటి విద్యాబాలన్ కు ఉత్తమనటిగా జాతీయస్థాయిలో అవార్డు లభించింది. ఈ సినిమా తెలుగు, తమిళంలో డబ్బయి మంచి విజయాన్ని అందుకుంది.!! Introduction to Cine Artist Silk Smitha
మిస్టరీగా సిల్క్ మరణం…!!
సిల్క్ స్మిత మరణం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. సిల్క్ ను మోసం చేసిన సూపర్ స్టార్ ఎవరు? ఆయన చేసిన మోసం ఏమిటి? సిల్క్ ది నిజంగా ఆత్మహత్యేనా? లేక హత్యనా? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పటివరకు సరైన సమాధానం లేదు. సిల్క్ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు సింపుల్ గా కేసు మూసివేశారు. ఇండస్ట్రీ లో 17 సంవత్సరాలు మాత్రమే వున్న సిల్క్ మరణించే నాటికి ఆమె వయసు కేవలం ముఫ్ఫై అయిదేళ్ళు (35) మాత్రమే. జీవితంపై ఎంతో ఆశను పెంచుకున్న సిల్క్ ఇలా అర్థాంతరంగా దూరమవడం నిజంగా విషాదమే..!!