Header Top logo

Glue matte command బ్రహ్మకడగని పాదం…!!

Under those feet
Glue matte command

బ్రహ్మకడగని పాదం…!!

ఆ పాదాలకింద
అంటిన మట్టే నాదేశం
అవి పగుళ్ళు కాదు..
నాదేశపు చిగుళ్ళు !

ఆ పాదాలు నడిచిన
చోటల్లా పచ్చదనమే
ఆ పాదాలు అంటిన
నేలంతా నందన వనమే!

ఏ బ్రహ్మా కడగని
బంగారు మట్టి పాదాలవి
ఏ కవులూ రాయలేని
మహత్తర కావ్యాలవి !!

ఆ పాదాల ముద్రలు
ఎప్పటికీ పచ్చివే….
ఆ పాదాల పరిమళం
ఇప్పటికీ పారిజాతమే.!!

ఆ పాదాలకు చందనం !!
ఆపాదాలకు వందనం !!

ఆపాదమస్తకం
శ్రమపుస్తకం
రైతన్న జీవితం!!

Rosaiah garu politica life రోశయ్య గారూ! మరువలేము మీ కార్య చతురత

ఎ.రజాహుస్సేన్, రచయిత

Leave A Reply

Your email address will not be published.

Breaking