AP 39TV 06ఏప్రిల్ 2021:
జడ్ పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే.మన రాష్ట్రం, మన జిల్లా, మన నియోజకవర్గం, మన ప్రాంతం..ఇలా సర్వతోముఖంగా అభివృద్ధి సాధించాలి అంటే..వైసీపీ పార్టీ బలపరిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలి అని శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి పిలుపునిచ్చారు. జడ్ పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో పర్యటించారు.ఈ సందర్భంగా ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రజాసేవ మార్గంలో దూసుకుపోతోంది. రేపు జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటేసి వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధి పథంలో మరింత ముందంజలో నడవచ్చునని ప్రజలకు వివరించారు.మండల కేంద్రమైన బుక్కరాయ సముద్రంలో ఇంటింటికి పాదయాత్ర లా బయలుదేరి ప్రజల క్షేమ సమాచారాలు తెలుసుకొని ఓటు వేయమని అభ్యర్థించారు. ప్రజా సమూహాల మధ్యలోకి వెళ్లి వైసీపీ పార్టీ చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పేరుపేరునా వివరించారు.