Header Top logo

So far Is she safe ఆమె క్షేమమేనా..?

So far, Is she safe

ఆమె క్షేమమేనా…?

గుసగుసలాడుతూ పూలు
పరిమళాలను పొదివి పట్టుకున్నాయి
విరబూసిన కురులను తనివితీర ముద్దాడాలని

ముసిముసి నవ్వులతో చిరుగాలి
ముగ్ధ మోహనమై ఎదురుచూస్తోంది
అర్ధనగ్న దృశ్యాలెన్నిటినో ఆలింగనం చేసుకోవాలని

ఒగలుపోతూ కాటుక ఓరకంట గీటుతూ
వయారంగ చూస్తోంది
కునుకురాని కంటికి
కనిపించని మర్మమేదో కవ్విస్తూ చూపించాలని

అందమంటే నేనేననే సింధూరం
పొందికగా కూచుంది
ముద్దులొలికెడి ముఖారవిందాన
మురిసి మెఱిసిపోవాలని

సడిచేసే గాజులన్ని
అంబరాన్ని తొడుక్కుని
సంబుర పడిపోతున్నాయి
ముడివేసిన ముచ్చట్లను
ఒక్కొక్కటిగా విప్పి చెప్పాలని

సిగ్గునంత సింగారించుకున్న
సిరి మువ్వల గలగలలు
తొలకరి చినుకుకై చూసే ధరణిలా తొంగి తొంగి చూస్తున్నాయి
హృదయ కవాటపు ధ్వనులతో కూడి పులకించిపోవాలని

వెండి వెలుగులను రాల్చు నిండు పున్నమి
కరిగిపోతున్న క్షణాలను మోస్తుంది
మైమరిపించే కొత్త కోరికలు
మంచు పరదాలలో కలిసిపోతున్నాయి
ఎవరు చెప్పినా వినని కాలం
ఎవరు చెప్పినా వినని కాలం
ఎన్ని సార్లు తిట్టుకుందో
ఎదురు చూసిన వసంతం
ఎంతకీ రాలేదని….

So far Is she safe

ఇంతకీ,
ఆమె క్షేమమేనా…

చ్చ రాజమౌళి

దుబ్బాక, 9059637442

(ప్రపంచ మహిళ దినోత్సవం సందర్భంగా..)

Leave A Reply

Your email address will not be published.

Breaking