Header Top logo

MLA Kidnapped By Naxalights-8 ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిన నక్సల్స్

కిడ్నాప్

Kidnapped By Naxalights

నక్సల్స్ చెరలో ఎమ్మెల్యే-08

MLA Kidnapped By Naxalights-8

 24 డిసెంబర్ 1989 ఆదివారం..

అడవిలో అది కొత్త ప్రాంతం.. నక్సల్స్ బంధీగా ఉన్న నాకు రాత్రంతా నిదుర రాలేదు..తెల్లవారు జామున నిదురలోనికి జారుకున్నాను.. గంట పాటు నిదుర పట్టింది.. తరువాత నక్సల్స్ మాటలకు మేల్కొన్నాను. ‘‘ప్రతి రోజు ఇంటిలో బెడ్ రూమ్ లో ఎసీ కింద చలి పెట్టకుండా రగ్గు కప్పుకుని ప్రశాంతంగా నిదుర పోయే వాణ్ణి. అడవిలో నక్సల్స్ బందీగా భయం.. భయంగా పడుకున్నాను.’’ అనుకున్నాను..

నక్సల్స్ తమ బ్యాగ్ ను సర్దుకుంటున్నారు. ఇంకా తెల్లవార లేదు.. చీకట్లో సూరీడు రాకకు ముందు ఎరుపు రంగేసినట్లు ఆకాశం కనిపిస్తోంది.

మిలిటెంట్ కు   పని చెప్పి దళ కమాండర్ పంపించాడు..

తరువాత మేము మళ్లీ నడుక ప్రారంభించాము. నన్ను కిడ్నాప్ చేసారని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన దొరుకకుండా నక్సల్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారనిపించింది.

మరో గంట పాటు నడిచి దట్టమైన అడవిలో గుట్టపైన కూర్చున్నాము. ఉదయం పది గంటలప్రాంతంలో మిలిటెంట్ రోజు దిన పత్రికలను తీసుకుని వచ్చాడు.

‘‘మీ ఎమ్మెల్యే మంచోడెనా..?’’

మిలిటెంట్ ను  ప్రశ్నించాడు దళ కమాండర్.

‘‘మా తాండాలో కరెంట్ స్థంబాలు వేయించిండు.. మంచోడే..’’ అన్నాడు మిలిటెంట్.

మిలిటెంట్ చెప్పిన మాట విని నా మొఖం చూసాడు దళ కమాండర్ ప్రసాద్ తరువాత రోజు తెచ్చిన పత్రికను నక్సల్స్ శ్రద్దగా చదువుతున్నారు.. రోజు వచ్చిన వార్తను చదువుతునే దళ కమాండర్ ప్రసాద్ మరో పత్రికను చదువుమని నాకు ఇచ్చాడు..

నన్ను నక్సల్స్ కిడ్నాప్ చేసిన వార్త పత్రికలలో ఎలా రాసారో చదువుతున్నాను.

‘‘నక్సల్స్ చేదేశంఎమ్మెల్యే మండవ కిడ్నాప్’’

పెద్ద అక్షరాతో బ్యానర్ ఐటం అది..

ఐటం మధ్యలో నా ఫోటో.. 

‘‘నిజామాబాద్ జిల్లా డిచ్ ల్లి ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర్రావు (టీడీపి) ను సీపీఐ (ఎం.ఎల్.) పీపుల్స్ వార్గ్రూప్ కు చెందిన ప్రసాద్ దళం తీవ్రవాదులు శనివారం ఉదయం 11 గంటకు కిడ్నాప్ చేసారు. దళం విధించిన షరతులకారణంగా వార్త సాయంత్రానికి గాని జిల్లా కేంద్రానికి తెలియలేదు.

ఆధిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలో శుక్రవారం నాడు అరెస్టు చేసిన తమ సహచరులను విడుదలచేయాలని డిమాండ్ చేస్తూ తీవ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధిని  రాడికల్స్ కిడ్నాప్ చేయడం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే మొదటి సారి.

ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర్ రావు శనివారం ఉదయం ధర్పల్లి మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులు, సిర్నాపల్లి సర్పంచ్ రఘువీర్ రెడ్డితో రామడుగు గ్రామానికి పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి వెళ్లారు. ప్రారంభోత్సం ముగిసిన తరువాత పది మంది తీవ్రవాదులు తుపాకులతో గ్రామంలోకి ప్రవేశించి ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులను కిడ్నాప్ చేసారు.

అంతకు ముందు వారు గాలిలోనికి కాల్పులు జరిపారు. ఊరికి రెండు కిలో మీటర్ల దూరం తీసుకెళ్లిన నక్సల్స్ ఎమ్మెల్యేను తప్ప మిగిలిన వారిని వదిలి పెట్టారు. అయితే.. వార్తను సాయంత్రం ఐదు గంట వరకు ఎక్కడ పొక్కనీయద్దని కట్టడి చేసారు.

ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో కొందరు నక్సల్స్  అరెస్టు చేసినందుకు నిరసనగా కిడ్నాప్ చేసినట్లు వారు పేర్కొన్నట్లు తెలిసింది. ప్రాజెక్ట్ రామడుగు ఎడమ కాలువ మరమ్మతు చేపట్టనందుకు నిరసనగా మరికొన్ని కారణాల ల్లకిడ్నాప్ కు ప్పాడినట్లు తెలిసింది.

రాడికల్స్ కిడ్నాప్ చేయడానికి మరి కొన్ని కారణాలు ఉండోచ్చని అధికారులు భావిస్తున్నారు. గతంలో కొంతమంది రాడికల్స్ సానుభూతి పరులను పోలీసులు అరెస్టు చేసిన సందర్బంలో ఎమ్మెల్యే పట్టించుకోక పోవడంతో నక్సల్స్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

కలెక్టర్ కు  లేఖ..

ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిన తీవ్రవాదులు కలెక్టరుకు ఇవ్వాల్సిందిగా ఒక లేఖ రాసి రఘువీర్ర్ రెడ్డికి ఇచ్చారు. ఆయన దాన్ని సాయంత్రం కలెక్టరుకు అందజేసారు. లేఖలో పేర్నొన్న ప్రకారం 25 సాయంత్రం ఐదు గంట లోపు వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న తమ సహచరును విడుదలచేస్తున్నట్లు రేడియోలో ప్రకటించాలని నక్సల్స్ డిమాండ్ చేసారు.’’  నేను వార్త చదివేసాను.

‘‘ఎమ్మెల్యేగారు.. వార్త చదువడం పూర్తయిందా..? విలేకరులు ఊహించుకుని తమకు ఇష్టమున్నట్లు వార్తలు రాస్తారు.. వార్తలో ఎన్ని ఆబద్దాలు రాసారో చదివారా..? ఐదుగురం మేముంటే.. పదిమంది తీవ్రవాదులమని రాసారు.. మేము తీవ్రవాదులం కాదు.. నక్సటైట్లము.. తీవ్రవాదులది హింసనే ప్రధాన ఎజెండాగా ఉంటుంది.

ఎప్పుడు ఎవరిని ఎందుకు చంపుతారో తెలియదు.. కానీ.. మేము పేద ప్రజ కోసం అన్నీ వదిలి ప్రాణాలకు తెగించి అడవిలో ఉండి పోరాటాలు చేస్తున్నాము.. తీవ్రవాదులకు.. నక్సల్స్ కు మధ్య తేడాను విలేకరులు గుర్తించక పోవడం బాగలేదు.’’ అన్నాడు దళ కమాండర్ ప్రసాద్.

‘‘మీరు కూడా తుపాకులు పట్టుకుని తప్పు చేసిన వ్యక్తులను హత్య చేస్తున్నారు గదా.. అందుకే విలేకరులు తీవ్రవాదులని రాసారచ్చు..’’ అన్నాను.

‘‘నిన్ను కిడ్నాప్ చేసినప్పుడు దేహశుద్ది చేసామా.. ఇగో గీ వార్తలో నిన్ను కొట్టినట్లు వార్త రాసారు.. ప్రజలముందే నిన్ను కిడ్నాప్ చేసాం.. నిజానికి కొట్టామా.. నీవు మాకు సహాకరించక పోతే కొట్టెవాళ్లమెమో.. విలేకరులు వాస్తవాలు వార్తలుగా రాస్తే బాగుంటుంది..’’

‘‘నిజమే.. విలేకరులు వాస్తవాలు వార్తలుగా రాయాలి.. కానీ.. వారికున్న సోర్స్ ద్వారా తెలుచుకుని అదే నిజమనుకుని వార్త రాస్తుంటారు. వార్త రాసే ముందు కన్ఫామ్ చేసుకోవడానికి మీరు అందు బాటులో ఉండరు కదా.. అదే పొలిటికల్ లీడరులైతే.. వారి వార్త రాసే ముందు తప్పకుండా వివరణ తీసుకుని వార్త ఇస్తారు విలేకరులు.’’

 ‘‘విలేకకులు ఏది రాయాలో ఏది రాయద్దో స్వయంగా నియంత్రించుకోవాలి.. ఇగో నా వ్యక్తిగత వివరాలు వార్తగా రాసారు.. వార్త రాయాల్సింది కాదెమో..’’

నన్ను కిడ్నాప్ చేసిన దళ కమాండర్ ప్రసాద్ జీవిత విశేషాలగురించి వార్త రాసారు విలేకరులు

‘‘ప్రసాద్ ది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండం గోవింద్ పేట్ గ్రామం.. అతని ఒర్జినల్ పేరు రాజన్న.. దళిత కులంలో పుట్టి పోస్ట్ గ్రాడ్యువేషన్ పూర్తి చేసాడు.. విద్యార్థి దశలోనే విప్లవ రాజకీయాలపట్ల ఆకర్శితుడైన ప్రసాద్ పిడిఎస్ యు విజృంభనలో పుల్ టైమ్ఆర్గనైజర్ గా పని చేసారు..

కొంత కాలం తరువాత పిడిఎస్ యులో పని చేయలేక పీపుల్ వారర్ గ్రూప్ నక్సల్స్ సిద్దంతాలపట్ల ఆకర్శితుడైనట్లు తెలిసింది. సదాశివ్ నగర్ మండంలోని మారుమూలఅటవీ ప్రాంతంలో 1987 మే నెలో పీపుల్ష్ వార్ గ్రూప్ నక్సల్స్ రాజకీయ శిక్షణ తరగతులకు మొదటి సారిగా హాజరైనట్లు తెలిసింది. కొంత కాలం పాటు రాడికల్ స్టూడెంట్ యూనియన్ నిజామాబాద్ జిల్లా ఆర్గనైజర్ గా సలీం పేరుతో కూడా పని చేసినట్లు తెలిసింది.

జిల్లాలో దళాలను విస్తరించడంలో భాగంగా ప్రసాద్ కు సిర్నాపల్లి దళ కమాండర్  బాధ్యతలు అప్పగించింది అధిష్టాన వర్గం.. అయితే.. ప్రసాద్ కు బాల్యంలోనే జక్రాన్ ల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన యువతితో పెళ్లి జరిగింది..

వీరికి ఒక కుమారుడున్నట్లు తెలుస్తోంది. నమ్మిన సిద్దాంతం కోసం కన్న కుమారుడిని వదిలి అడవి బాట పట్టి ఉద్యమాలు చేస్తున్న ప్రసాద్ బాటలోనే తన ఆర్థాంగి పద్మ నక్సల్స్ ఉద్యమంలో పని చేస్తోంది.’’ వార్త చదివిన తరువాత దళ కమాండర్ ప్రసాద్ అంటే నాకు క్లారిటి వచ్చింది.

అతను నమ్మిన సిద్దాంతం కోసం ప్రాణాలు అర్పిస్తాడనిపించింది.

దశ నుంచి విప్లవ రాజకీయాలలో ఉన్న ప్రసాద్ ఆలోచలనలు.. నిర్ణయాలు కరెక్ట్ గా ఉంటాయనిపించింది.

‘‘ప్రభుత్వం నుంచి ఇంకా రెస్పాన్స్ లేదు. రేడియో వార్తలో కూడా నీ కిడ్పాప్ వార్తనే చెప్పారు.. మా డిమాండ్ గురించి ఏమి చర్యలు తీసుకుంటున్నారో స్పష్టం చేయలేదు ప్రభుత్వం. సరే.. పేపర్లో వచ్చిన మరో వార్త కూడా చదువు’’ పత్రిక ఇచ్చాడు దళ కమాండర్ ప్రసాద్..

రోజు వచ్చిన పత్రికలను ఇంట్రెస్ట్ గా చదువుతున్నారు దళ సభ్యులు. సెంట్రీ చేస్తున్న దళ సభ్యుడు మాత్రం తమకు ఇచ్చిన డ్యూటీ మాత్రమే చేస్తున్నాడు. నన్ను కిడ్నాప్ చేసిన తరువాత  పోలీసులు పెద్ద సంఖ్యలో అడవిలో గాలింపు చర్యలు చేపడుతారెమోనని నక్సల్స్ అనుమానిస్తున్నట్లనిపించింది.

మేము ఎక్కడ ఉన్నా.. భద్రత కోసం మందు పాతరలు ఏర్పాటు చేసుకుని సెంట్రీ మధ్యన కూర్చున్నాము.. అప్పటికే నన్ను కిడ్నాప్ చేసి 24 గంటలు గడిచింది.

అదే పత్రికలో మరో వార్త కూడా ప్రచురితమైంది.

కలెక్టర్ అజేయేంద్రపాల్ విలేకరులసమావేశంలో మాట్లాడిన ఆంశాలతో వార్త అది..

‘‘సాయంత్రంలోగా ఆకాశవాణి పలుకాలి..’’

బ్యాక్ బ్లూ కలర్ లో అక్షరాలతో వచ్చిన వార్త..

వార్త మధ్యలో ఎన్నికలో ఓటు వేస్తున్న నిలువెత్తు ఫైల్ ఫోటో..

‘‘వరంగల్ జైల్లో ఉన్న కొంత మంది తమ సహచరులను విడుద చేస్తున్నట్లు ఈనె 24 తేదిన (ఆదివారం) సాయంత్రంలోపు రేడియోలో ప్రకటించాలని డిచ్ల్లి ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రావును కిడ్నాప్ చేసిన నక్సల్స్ డిమాండ్ చేసారని జిల్లా కలెక్టర్ అజేయేంద్రపాల్ తెలిపారు.

కొన్ని పాత కేసులకు సంబంధించి కొంతమంది తీవ్రవాదులను అరెస్టు చేసి వరంగల్ జైల్లో ఉంచారని వారిని విడుదలచేయాలని రాడికల్స్ డిమాండ్ చేసినట్లు ఆయన వివరించారు.. ఎమ్మెల్యే భద్రత దృష్ట్యా రాడికల్స్ పేర్లను బయట పెట్టడానికి ఆయన నిరాకరించారు.

ఎమ్మెల్యే మండవకు ఎలాంటి హాని జరుగదని ఆయన క్షేమంగా తిరిగి వస్తాడని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.. సంఘటనకు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.’’

ఇదే వార్త కింద సబ్ హెడ్డింగ్ పెట్టి మరో వార్త

భయాందోళనల్లో నాయకులు..

 ‘‘డిచ్ల్లి ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర్ రావును నక్సల్స్ కిడ్నాప్ చేయడంతో ధర్పల్లి మండలపొలిటికల్ లీడర్ల గుండెల్లో రైల్లు పరుగెడుతున్నాయి.. తెలుగు దేశం ప్రభుత్వ హయంలో జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా పొలిటికల్ లీడరులను టార్గెట్ చేస్తున్నారు నక్సల్స్..

బతికుంటే బలిసాకు తినచ్చని భావించిన చాలా మంది పొలిటికల్ లీడర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు.. అయితే.. కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే ప్రాణాలకు ఎలాంటి హాని తపెట్టవద్దని ప్రజలు కోరుతున్నారు.’’

వార్తు చదివిన తరువాత నక్సల్స్ వ్యూహం అర్థమైంది.

వరంగల్ జైల్లో ఉన్న తమ అనుచరులను  ప్రభుత్వం విడుదలచేయనట్లయితే.. నన్ను ఖతం చేస్తారనిపించింది.

ఒక్కటి మాత్రం నిజం.. నక్సల్స్ వారి డిమాండ్ కోసం అవసరమనుకుంటే నన్ను ఖతం చేయడం ఖాయమనిపించింది.. దేవతలకు మేకను బలిచ్చే ముందులా నా పరిస్థితి ఉందనిపించింది.

అయినాచంపుతారని తెలిసినా.. ధైర్యంతో ఉండటం మినహా  ప్రతి క్షణం బాధ పడటంలో లాభం లేదనిపించింది.

టీడీపీ నేతలు మహిపాల్ రెడ్డి.. డి.సత్యనారాయణ గురించి అడిగాడు దళ కమాండర్..

జిల్లా రాజకీయాలు, వారి ఆస్థులగురించి వాకబు చేసాడు అతను..

‘‘నీ ఆస్థులు ఎంతుంటాయి..’’

అడిగాడు దళనేత ప్రసాద్..

నా ఆస్థులవివరాలు చెప్పినప్పుడు ఇంతెనా.. అన్నాడు అతను.

‘‘ఆబద్దాలు చెప్పడం అలవాటు లేదు. మీ దగ్గర ఆబద్దం చెప్పడం అసలే లేదు. మీరు నా ఆస్తులు చెక్ చేసుకోవచ్చు.’’

అన్నాను.

బయట పోలీసులు మాకోసం గాలిస్తున్నట్లుగా సమాచారం లేదు.

కానీ.. ఫారెస్ట్ లో అక్కడక్కడ పోలీసు బూట్ల గుర్తు కనిపించడంతో నక్సల్స్ అలార్టు అయ్యారు. ఒకవైపు గాలింపు చర్యలు చేపట్టడం లేదని చెబుతునే మరోవైపు పోలీసులు గాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసాడు దళ కమాండర్ ప్రసాద్..

ఒకవేళ పోలీసులు ఎదురుపడిన మా నుంచి తప్పించుకోవడానికి నీవు ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయని నన్ను హెచ్చరించాడు అతను.

మేము నిన్ను కాల్చ పోయిన పోలీసులు  కాల్పులు జరిపి నక్సలైట్లు ఎమ్మెల్యేను హత్య చేసారని పోలీసు కథలు అల్లుతారు.. నీవు మాతోనే ఉండుమని నా ప్రాణానికి భరోసా ఇచ్చాడు దళ కమాండర్.

అతని మాటలలో విశ్వాసముందనిపించింది.

అయినా.. నక్సలైట్లకు బంధుత్వాలు లేవు..

భ్యులకు దూరంగా ఉద్యమాలు చేస్తున్న నక్సల్స్ లో స్వార్థం ఉండదనిపించింది..

ఒకవేళ తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి నక్సల్స్ అవసరమైతే నన్ను హత్య చేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తారెమో అనిపించింది.

MLA Kidnapped By Naxalights-8

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

 

Leave A Reply

Your email address will not be published.

Breaking