Header Top logo

Santosh helping the poor పేదలకు సహాయం చేస్తున్నకాకి సంతోష్

Santosh helping the poor

Santosh helping the poor పేదలకు సహాయం చేస్తున్నకాకి సంతోష్

ధానం చేసే గొప్ప గుణం సంతోష్ ఆస్తి..

ఔను.. పేదలకు సహాయం చేస్తేనే అతనికి ఎంతో సంతోషం. కోట్లున్న ధరిద్రులకంటే ధానం చేసే గొప్ప గుణం ఉన్న పేదోడు అతను. ఆపదలో ఉన్నోళ్లకు సహాయం చేయడానికి పదవులు అవసరం లేదు.. మంచి మనసుంటే సరి పోతుందని నిరూపిస్తున్నాడు కాకి సంతోష్ కుమార్.

Santosh helping the poor పేదలకు సహాయం చేస్తున్నకాకి సంతోష్

కాంట్రాక్ట్ కార్మికుడిగా..

విశాఖపట్నం మల్కాపురంలో నివాసం ఉంటున్న కాకి సంతోష్ కుమార్ పేదరిక కుటుంబంలో పుట్టాడు. కంచెరపాలెం ప్రభుత్వ ఐటిఐ చదివాడు. బతుకు తెరువు కోసం వృత్తి నేవల్ డాక్ యార్డులో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.

Santosh helping the poor పేదలకు సహాయం చేస్తున్నకాకి సంతోష్

తండ్రి మరణంతో..

విశాఖ జిల్లా అడ్డురోడ్ దగ్గరలో గల కొరుప్రోలుకు చెందిన నూకరాజు-వరలక్ష్మీల కుమారుడే ఈ సంతోష్ కుమార్. ఉన్న ఊళ్లో బతుకు తెరువు లేక 1990లో కుటుంబంతో విశాఖకు వలస వచ్చిన నిరుపేద కుటుంబం అతనిది. బట్టల వ్యాపారం చేస్తూ కుటుంబాణ్ణి పోషించే నూకరాజు 2005లో ఆనారోగ్యంతో మరణించాడు. ఇంటి పెద్ద మరణంతో మరిన్ని ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే కుటుంబాన్ని అన్నీ తానై ముందుకు నడిపింది తల్లి వరలక్ష్మీ. కూగాయలు అమ్ముతూ జీవితం వెళ్లతీసే తల్లి బాధలను చూసిన కొడుకు సంతోష్ కుమార్ కష్టాలు పడేవారంటే అతనికి వల్ల మాలిన ప్రేమ.

Santosh helping the poor పేదలకు సహాయం చేస్తున్నకాకి సంతోష్

వివేకానందుడి స్పూర్తిగా..

పేదరికంలో పుట్టి పెరిగిన సంతోష్ కుమార్ కు పుస్తకాలు చదువడం హభి. వివేకానందుడు, మధర్ థెరిస్సాలాంటి మహానీయుల జీవిత చరిత్రలను చదివిన అతను 2015 నుంచి పేదలకు సహాయం చేస్తూ పెద్దల మన్ననలు పొందుతున్నాడు.

Santosh helping the poor పేదలకు సహాయం చేస్తున్నకాకి సంతోష్

ఆనాధశ్రమాల్లో..

కష్టాలలో ఉన్న పేదలకు సహాయం చేస్తూ సంతోష పడే సంతోష్ కుమార్ తల్లి వరలక్ష్మీ కూడా 2020లో క్యాన్సర్ తో మరణించింది. కన్నతల్లికి కార్పోరేట్ వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేని సంతోష్ కుమార్ కు తల్లి మరణం బాధ పెట్టినా.. పేదలకు సహాయం చేస్తూ సంతోష పడుతున్నాడు అతను. విశాఖపట్నంలోని రేడియో స్టేషన్ లో మిర్చి 98.3 Fm లో మాయగాడు ప్రేమ్ తో తనకు లభించిన అవార్డులను షేర్ చేసుకున్నాడు సంతోష్ కుమార్.

సేవాకు గుర్తుగా ఎన్నో అవార్డులు..

పొద్దంతా కష్ట పడితే వచ్చే డబ్బులో 30 శాతం పేదల కోసం ఖర్చు చేస్తున్నాడు సంతోష్ కుమార్. ఆనాధశ్రమంలో పేదల ఆకలి తీర్చడం.. రక్తదానం చేయడం.. రోడ్ ల వెంట చలిలో వణుకుతున్న పేదలకు దుప్పట్లు దానం చేయడం.. ఫ్రెండ్స్ తో కలిసి మొక్కలు నాటడం.. మానసిక రోగులను అక్కున చేర్చుకుని వారికి తల వెంట్రుకలు కటింగ్ చేయడం..

Santosh helping the poor పేదలకు సహాయం చేస్తున్నకాకి సంతోష్

కరోనా కాలంలో పేదలకు మాస్క్ లు.. బోజనం పెట్టి ఆకలి తీర్చడం ఇగో ఇలాంటివి ఎన్నో సేవాలు చేస్తున్న సంతోస్ కుమార్ (Royal Success International Book of Records) చోటు సంపాదించుకున్నాడు. International Office America USA కు చెందిన సంస్థ Indian Humanity Persion) అవార్డ్ ఇచ్చింది.

అవార్డులు-సన్మానం

దేశం కోసం ప్రాణాలర్పించిన జాతీయ నాయకుల విగ్రహాలను శుభ్రం చేసి కాకి సంతోష్ కుమార్ ప్రముఖుల మన్ననలు పొందారు. అతను చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు.. సన్మానాలు అందుకుంటున్నాడు. లండన్ కు చెందిన సంస్థ ‘ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ ప్రధానం చేసింది. అలాగే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ , ఇండియన్ హుమనేత్రియనే అవార్డ్, దీ బ్రిటిష్ వరల్డ్ రికార్డ్స్ లండన్ సంస్థ షైనింగ్ స్టార్ సోషల్ సర్వీస్ బిరుదు ప్రదానం చేశారు.
కష్టాల కన్నీళ్లను చూసినా..

Santosh helping the poor పేదలకు సహాయం చేస్తున్నకాకి సంతోష్

పుట్టిన నుంచి పేదరికం లోని కష్టాలతో బాధ పడే పేదలను చూసిన తాను వారికి ఉడుత భక్తిగా సహాయం చేయడం మనిషిగా తన బాధ్యత అంటున్నాడు సంతోష్ కుమార్. మనిషిగా పుట్టినందుకు ప్రతి ఒక్కరు కళ్ల ముందు కష్టాలలో ఉన్న వారికి సహాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు అతను.

mallesh yatakarla

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

1 Comment
  1. A.Nagalakshmi says

    Really great santhosh proud off you hatts up to your honest services

Leave A Reply

Your email address will not be published.

Breaking