Header Top logo

sakshi iteam :‘ఊరినే అమ్మేశారు’ .. కదిలించిన కథనం

sakshi iteam :‘ఊరినే అమ్మేశారు’ .. కదిలించిన కథనం

అతను కళ్ల ముందు జరిగే అన్యాయాలను కలంతో సమాధానం చెబుతాడు. కుళ్లిన ఈ సమాజంలో జరిగే దోపిడీని అక్షరాల (కథనాల)తో ప్రశ్నిస్తాడు. సమస్య పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళుతాడు. అవసరమనుకుంటే అన్నీ తానై జర్నలిస్ట్ గా వరుస కథనాలు ఇచ్చి ప్రజా కోర్టులో నిలబెడుతాడు. నమ్మిన అక్షర సిద్ధాంతం కోసం పేదల పక్షణ నిలుస్తాడు.

అతనే కామారెడ్డి జిల్లా ‘సాక్షి’ దిన పత్రిక స్టాఫ్ రిపోర్టర్ సేపూరి వేణు గోపాల్ చారి.. ఓ జర్నలిస్ట్  ఎప్పుడు సంతోషపడుతాడు..? తాను రాసిన వార్త కథనం తెల్లారి పేపరులో వచ్చిన తరువాత చంటి బిడ్డను చూస్తున్నట్లు చూస్తూ మురిసి పోతాడు. ఆ వార్తతో సమస్య పరిష్కరమైనప్పుడు.. ఇప్పుడు వేణు గోపాల్ చారి కూడా సంతోష పడుతున్నాడు.

‘ఊరినే అమ్మేశారు’ అనే శీర్షికతో జర్నలిస్ట్ గా వేణు గోపాల్ చారి ‘సాక్షి’ దిన పత్రికలో 21 డిసెంబర్ 2020లో రాసిన వార్త కథనంను డిగ్రీ విద్యార్థులు తమ పాఠ్యాపుస్తకాలలో చదువనున్నారు.

ఔను.. మీరు చదివింది నిజమే.. నేటితరానికి ‘సాక్షి’ దిన పత్రికలో (sakshi iteam) ‘ఊరినే అమ్మేశారు’ కథనం ఓ పాఠ్యాంశమైంది. యువతరాన్ని మేల్కొలిపే ఆయుధమైంది. డిగ్రీ మూడో ఏడాది తెలుగు పుస్తకంలో ఆ వార్త కథనాన్ని పాఠంగా చేర్చారు. తెలుగు అకాడమీ రూపొందించిన తెలుగు పుస్తకాన్ని ఇటీవల ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ఆవిష్కరించారు. ఇంతకు వేణు గోపాల్ చారి రాసిన ‘ఊరినే అమ్మేశారు’ వార్త కథనంలో ఏముందని ఆలోచిస్తున్నారా..?

రికార్డులు తారు మారు చేస్తూ ఊరినే అమ్మేసిన ఓ ఘనుడి నిర్వాకం వల్ల కామారెడ్డి జిల్లా బూరుగిద్ద పల్లెవాసులు పడే గోసను వార్త కథనంగా రాసి ప్రజల ముందు పెట్టారు. ఆ కథనంలో మానవీయ కోణం చూసింది సాక్షి. అంతే.. మెయిన్ పేజీలో ఆ కథనం హైలెట్..

కామారెడ్డి కలెక్టర్ శరత్ స్పందించారు. ఆర్డీవో శ్రీనివాస్ ను విచారణకు ఆదేశించారు. మధ్యాహ్నం వరకు నివేధిక సిద్దం.. కలెక్టర్ ఆదేశాలతో ఆ బూరుగిద్ద పల్లె వాసులకు పొజిషన్ సర్టిఫికెట్స్ అంద చేశారు. అంతే.. రియల్టర్ ల కభ్జాకు వెళ్లాల్సిన  ఆ ల్యాండ్ కు పేదలు ఓనర్ లు అయ్యారు.. సీన్ కట్ చేస్తే..

ఆ బూరుగిద్ద పల్లెకు చెందిన నిహారిక ప్రైవేట్ కాలేజ్ లో లెక్చరర్.. రియల్టర్ల మోసాన్ని పసిగట్టిన ఆమె లోకల్ విలేకరులకు మొర పెట్టుకుంది. వార్త రాస్తామన్నారు. తెల్లారి పత్రికల్లో కనిపించలేదు. అయినా.. నిహారిక నిరాశ పడలేదు. కామారెడ్డి ‘సాక్షి’ రిపోర్టర్ వేణు గోపాల్ చారికి ఫోన్ నంబర్ సంపాదించింది. ఫోన్ చేసి మాట్లాడింది. ఆమె చెబుతుంటే అన్ని రాసుకున్నాడు.  లింగంపేట్ మండల రిపోర్టర్ గంగాధర్ కు చెప్పి ఫొటోలు తెప్పించుకుని వార్త కథనం ఇచ్చాడు.

‘ఊరినే అమ్మేశారు’ వార్త కథనంతో 24 గంటల్లో సమస్య పరిష్కారమైంది. మేలు చేసినోళ్లకు కృతజ్ఞతలు చెప్పడం పేదలలో ఉన్న ప్రత్యేకత.. జర్నలిస్ట్ వేణు వార్త రాయడం వల్లనే సమస్య పరిష్కారమైందని బూరు గిద్ద పల్లె పేదలు కామారెడ్డికి వచ్చారు. వేణును కలువడానికి ప్రయత్నించారు. కానీ.. ఆ రోజు వేణు లోకల్ గా లేడు.. అంతే… నిహారిక ఆధ్వర్యంలో హైదరాబాద్ ‘సాక్షి’ దిన పత్రిక ఆఫీస్ కు వెళ్లారు. ఎడిటర్ మురళి సార్ ని కలిసి కృతజ్ఞతలు చెప్పారు.

‘‘రిపోర్టర్ లు వార్తలు రాస్తే కాంప్లెట్ చేయడానికి మా వద్దకు వస్తారు.. కానీ.. కామారెడ్డి రిపోర్టర్ వేణు వార్త రాస్తే కాంప్లిమెంట్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది.’’ అని వ్యాఖ్యానించారు ఎడిటర్ మురళి. ఇదంతా ‘ఊరినే అమ్మేశారు’ కథనం వెనుక దాగిన నిజం.. ఆ కథనం డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాపస్తకంలో రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వేణు గోపాల్ చారి  జర్నలిస్ట్ గా ఇలాంటివి రాసిన వార్త కథనాలు ఎన్నో.. కొడుకు, కోడలు చనిపోయి.. భిక్షం ఎత్తుకుంటూ ఇద్దరు మనుమరాళ్లను, ఒక మనుమడిని పోషిస్తున్న ముసలవ్వ గంగవ్వా గురించి ‘నాయనమ్మ- ముగ్గురు పిల్లలు’ అనే శీర్షికతో  వేణు ఇచ్చిన వార్త కథనం వారి జీవితంలో వెలుగు నింపింది.  ఆ వార్త కథనం చదివిన కలెక్టర్ శరత్ స్పందించి ఆ వృద్ధురాలికి యాభై వేలు ఇచ్చి, మనవరాలికి ఉద్యోగం ఇప్పించాడు.  గుడిసెలో ఉంటున్న గాంగవ్వకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇచ్చాడు.  అప్పుడు కూడా వేణు ఇలానే సంతోష పడ్డాడు.

కరోనాతో భార్య భర్తలు మరణిస్తే  అనాథలైన పిల్లల భారం నాయనమ్మ మోసింది. అయితే ఇంటి అప్పు ఆ నాయినమ్మకు పెద్ద కష్టమే తెచ్చి పెట్టింది. అప్పు కట్టాలే. లేదంటే బ్యాంక్ వాళ్లు వేలం వేస్తారు. ఇది తెలిసిన వేణు రాసిన కథనం కలెక్టర్ శరత్ ను కదిలించింది. ఆయన చొరవ తీసుకుని బ్యాంక్ లోన్ సమస్య పరిష్కరించాడు.

‘ఊరినే అమ్మేశారు’  సాక్షి దిన పత్రికలో రాసిన వార్త కథనం పాఠ్యాపుస్తకంలో వస్తుందని తెలిసి  కామారెడ్డి జిల్లా రిపోర్టర్ సేపూరి వేణు గోపాల్ చారికి కాల్ చేశాను. అతనితో నాకు ఇరువై అయిదేళ్ల అనుబంధం ఉంది.

sakshi iteam :‘ఊరినే అమ్మేశారు’ .. కదిలించిన కథనం

sakshi iteam :‘ఊరినే అమ్మేశారు’ .. కదిలించిన కథనం
– పేపూరి వేణుగోపాల చారి, ‘సాక్షి’ దిన పత్రిక స్టాఫ్ రిపోర్టర్

‘కంగ్రాష్యులేషన్ వేణు..’అన్నాను. ‘‘థాంక్స్ అన్నా..’’ అన్నాడు వేణు. ‘‘సోషల్ మీడియాలో నీవు హీరోవు అయ్యావ్.. ‘ఊరినే అమ్మేశారు’ వార్త కథనం పాఠ్యాపుస్తకంలో వస్తున్నట్లు తెలిసి ఎలా ఫీలాయ్యావ్..’’ నార్మల్ గా ప్రశ్నించాను.

‘‘అన్నా.. ఈ సమాజంలో జర్నలిజం వృత్తి గొప్పది. ఇన్నేళ్ల జర్నలిజంలో డబ్బులు సంపాదించలేను.. కానీ అంతకంటే ఎక్కవ జర్నలిస్ట్ గా తృప్తిని ఇచ్చింది. ఎన్నో వార్తలు రాస్తాం.. కానీ.. కొన్ని వార్తలు మరిచి పోలేనివి ఉంటాయి. ఈ ‘ఊరినే అమ్మేశారు’ వార్త నా జీవితంలో మరిచి పోలేనిది. సాక్షి కుటుంబంలో సభ్యుడిగా ఉన్నందకు ఆనందంగా ఉంది.’’ సంతోషంతో చెప్పాడు వేణు.

నిజమైన జర్నలిస్ట్ కు ఇంతకంటే ఏమి కావాలి..? నిజంగా నిక్చచ్చిగా వార్త  కథనాలు ఇచ్చే జర్నలిస్ట్ లు ఈ సమాజంలో చాలా మందే ఉన్నారు.. వాళ్లందరికి మనసులోనే సెల్యూట్ చెప్పి కాల్ కట్ చేసాను.

–  యాటకర్ల మల్లేష్, సీనియర్ జర్నలిస్ట్

1 Comment
  1. Neelasrinivas says

    Really great venanna

Leave A Reply

Your email address will not be published.

Breaking