రాజన్ని సిరిసిల్ల: కోడి పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం……
బండపల్లి గ్రామానికి చెందిన గశికంటి రాజు తన ఇంట్లో కొన్ని కోళ్లను పెంచుతున్నాడు.
తన కోడిని ఇసుక ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
చనిపోయిన కోడితో స్టేషన్‌కు రావడంతో అతడిని చూసి పోలీసులు, ప్రజలు కాసేపు నవ్వుకున్నారు.
ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.