ఏపీ 39 టీవీ,
ఏప్రిల్ -21,
కనేకల్:- మండల పరిధిలోని బ్రహ్మసముద్రం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా బ్రహ్మసముద్రం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కబడి పోటీలలో సుమారు 40 టీములు ఉండగా ఇందులో బై చేసిన జట్లు రాకపోగా 30 జట్టులు ఆడగా అందులో ఎవరికి వారే సత్తా చూపించుకున్నారు. ఎటువంటి సమస్యలు లేకుండా, మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కబడీ పోటీలలో బ్రహ్మసముద్రం గ్రామం కి సంబంధించిన 5 కబడ్డీ జట్టులో ఆడగా అందులో రెండు జట్టు లు మొదటి బహుమతి, రెండవ బహుమతి, ఆ గ్రామ వేర్వేరు జట్టు లు ఎవరికి వారే సాటి అంటూ కబడ్డీ పోటీలు ఆడారు పోటీలలో బహుమతులు బ్రహ్మసముద్రం జట్టు లే గెలిచినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వన్నప్ప, C.నరసింహులు, చిన్నయ్య గారి వెంకటేశులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.