Header Top logo

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏ.ఆర్ పోలీసులు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏ.ఆర్ పోలీసులు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో సమావేశమై పలు సూచనలు చేశారు.

కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం అలసత్వం వద్ధు. పిఎస్వో, గార్డు, ఎస్కార్ట్ , ప్రిజన్ ఎస్కార్ట్ , వి.ఐ.పి బందోబస్తు, తదితర విధుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్ధేశంచేశారు.
అందరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించడం, తరచూ శ్యానిటైజర్ వినియోగించడం, సామాజిక దూరం పాటించాలి.
గత ఏడాది తీసుకున్న జాగ్రత్తలు కంటే ఈసారి మరింత పకడ్బంధీగా చేపట్టాలి.
సేకెండ్ వేవ్ లో ఏ మాత్రం లక్షణాలు బయటపడకుండానే కరోనా ఇబ్బంది పెట్టే అవకాశముంది.
కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన చేయాలి
తరుచూ పల్స్ ఆక్సీ మీటర్లు వినియోగించి శాచురేషన్ చెక్ చేసుకోవాలి
జ్వరం, దగ్గు, పడిశం, నీరసం, ఒళ్లు నొప్పులు ఉన్నా వెంటనే సంబంధిత పైఅధికారుల దృష్టికి తీసికెళ్లి తద్వారా వైద్య సేవలు అందుకోవాలి.
ఈకార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ హనుమంతు, ఏ.ఆర్ డీఎస్పీ ఎన్ మురళీధర్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ ఎస్ ఐ లు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking