AP 39 TV 21 ఫిబ్రవరి 2021:రాయదుర్గం పట్టణంలో ఆదివారం ఉదయం మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మరియు మాజీ జెడ్పి ఛైర్మన్ పూల నాగరాజు ఇరువురు పట్టణంలోని 1 వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల గురించి కాలవ శ్రీనివాసులు ప్రజలకు వివరించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిత్యావసర వస్తువుల ధరలను పెంచి, పేదల నడ్డి విరుస్తోందన్నారు. రాయదుర్గం పట్టణంలో ఎక్కువ మందికి జీవనాధారమైన గార్మెంట్స్ పరిశ్రమను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పట్టణంలో దాదాపుగా 9 వేల కుటుంబాలు గార్మెంట్స్ పరిశ్రమపై ఆధారపడి ఉన్నా కేవలం 180 మందికే ఆర్థిక సహాయం రావడం బాధాకరమన్నారు. టైలర్లు అందరికి 10 వేల ఆర్థిక సహాయాన్ని అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యo వహిస్తోందన్నారు. వాహన మిత్ర పథకం కింద ఆటో కార్మికులు 960 మంది ఉంటే కేవలం 68 మందికే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. జగనన్న చేయూత, చేదోడు, వాహన మిత్ర, నేతన్న నేస్తం వంటి పథకాలలో అర్హులైన లబ్దిదారులకు తీవ్ర అన్యాయo జరుగుతోందన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు సక్రమంగా అందించడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుంది అన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి 1 వార్డు టీడీపీ అభ్యర్థి బుదూరు రామలక్ష్మి ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్తించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి కృష్ణ మూర్తి, కడ్డిపూడి మహబూబ్ బాషా, బుదూరు తిప్పేస్వామి, పోరాళ్ల పురుషోత్తం, భలే శంకర్, నాగమణి, నాయకుల తిప్పేస్వామి, మారెప్ప, ముద్దుల నాగరాజు, జమీల్ ఖాన్, సిమెంట్ శీనా చుంచుల రవి, పలువురి శీనా,మోపురి అశోక్,రావుత్ రాజశేఖర్,వెంకటేశులు, ఎల్లప్ప యువత ఆశోక్, దాసరి నవీన్, జానకి రాముడు, దాసరి సత్తి, హరి తదితరులు పాల్గొన్నారు.
R. ఓబులేసు,
ఏపీ39టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.