Header Top logo

మునిసిపల్ కార్యాలయంలో కోవిడ్ -19 వ్యాక్సిన్.

AP 39 TV 21 ఫిబ్రవరి 2021:రాయదుర్గం పట్టణం లో మునిసిపల్ ఆఫీసులో కోవిడ్ -19 వ్యాక్సిన్ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది, మునిసిపల్ కమిషనర్ బడే జబ్బార్ మియా గారు కోవిడ్ -19 వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది,ఎలాంటి అపుహాలు నమ్మొద్దని,అపుహాలకు తావివ్వకుండా మన కుటుంబం ఆరోగ్యాంగా ఉండాలంటే, కోవిడ్ -19 వ్యాక్సిన్ వేయించుకోవాలని, మన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గారు స్వయంగా వ్యాక్సిన్ వేయించుకొని ప్రజలకు అవగాహన కల్పించారు, రాయదుర్గం పరిధిలో మునిసిపల్ కమిషనర్ బడే జబ్బార్ మియా గారు కోవిడ్ -19 వ్యాక్సిన్ వేయించుకొని మునిసిపల్ సిబ్బందికి ఆదర్శం నిలిచారు. కమిషనర్ గారు మాట్లాడుతూ సమాజంలో ప్రజలకోసం పనిచేస్తున్నది మన మునిసిపల్ సిబ్బంది ఎక్కువగా పనిచేస్తుంటారు, అందుకే మునిసిపల్ సిబ్బంది మరియు మునిసిపల్ కార్మికులు కోవిడ్ -19 వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలియజేశారు. ఫస్ట్ పేస్ లో పనిచేస్తున్న వారు, అలాగే మునిసిపల్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇంజక్షన్ చేయించుకోవడం జరిగింది. మునిసిపల్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కరోనా బారిన పడకుండా కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకోవాలని మునిసిపల్ సిబ్బందికి మరియు మునిసిపల్ కార్మికులకు, వాలంటీర్ లకు, సచివాలయం సిబ్బందికి, తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ బడే జబ్బార్ మియా, మరియు డాక్టర్ రమేష్, ఆదిబయమ్మ సూపర్ వైజర్,DPO అనిల్ కుమార్, నళిని, తులసి, యశోద, సరోజ, సరోజ, సరళ భాయ్ మరియు మునిసిపల్ సిబ్బంది, కార్మికులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

 

 

R.ఓబులేసు,
ఏపీ39టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.

Leave A Reply

Your email address will not be published.

Breaking