నా తలమీద
పిట్ట రెట్ట పడింది
మీదకి చూశా
కీటకాన్ని మింగిన
మండూకం లాగా ఉంది
నీలపు వర్ణం
కాలాన్ని అడిగాను
రెట్టవేసిన పిట్ట పేరు చెప్పమని
వెళ్లిపోయిన గతం మళ్లీ వస్తే
అడిగి చెపుతానులే అంటూ
కొంటెగా నవ్వింది
పిల్లతెమ్మెరని దోసిట్లోకి
తీసుకొని అడిగాను
పిట్ట పేరు తెలిస్తే
ఏం చేయగలవు అంది
ఏమీ చేయలేను కానీ
నీ సత్యవాక్కులు వింటే
ఎడారి గుండెలు కొన్నైనా
సస్యశ్యామలం
అవుతాయని ఆశ
పర్కపెల్లి యాదగిరి