నర్సింగ్ విద్యార్థులకు న్యూ ఇయర్ గిఫ్ట్
తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది. న్యూఇయర్ వేళ నర్సింగ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులను భర్తీ చేయనున్నారు. వైద్య విధాన పరిషత్లో 757 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు ఇవే..
డీఎంఈ, డీహెచ్ – 3,823
వైద్య విధాన పరిషత్ – 757
ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ – 81
డిజబుల్డ్, సినీయర్ సిటిజెన్స్ వేల్ఫేర్ – 8
తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్స్ – 127
బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 197
ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 74
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 124
తెలంగాణ రెసిడెన్షియల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ – 13