నరేంద్ర మోదీ.. భారత దేశానికి ప్రధాని.. ఢిల్లీకి రాజు.. అయినా తల్లికి కొడుకే గదా.. ఇది నరేంద్ర మోదీ – హీరాబెన్ మోదీ ల మధ్య తల్లి కొడుకుల ప్రేమను చూసినప్పుడు గుర్తుకు వచ్చే మాటలు.
హీరాబెన్ మోదీ కూడా తెల్లని దుస్తులలో ఒక యోగిలా కనిపించే వారు. కొడుకు మోదీ తన వద్దకు వస్తే స్వీట్ లు తినిపిస్తూ తల్లి ప్రేమను చాటుకునే వారు. పక్షులకు, కుక్కలకు ఆహారం పెడుతూ హీరాబెన్ మోదీ తుది గడియాలలో కూడా సంతోషంగా గడిపారు. ఇటీవల 100 పుట్టిన రోజు సందర్భంగా కొడుకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు కూడా ప్రేమతో మాట్లాడి భవిష్యత్ గురించి నీతి వ్యాఖ్యాలు చెప్పింది తల్లి.
నరేంద్ర మోదీ రూటే సఫరేట్.. తల్లి మరణ వార్త విన్న మోదీ భావోద్వేకంగా ట్వీట్టర్ వేధికగా తల్లితో ఉన్న అనుభందాన్ని షేర్ చేసుకున్నారు.
‘‘మా తల్లి ఈశ్వరుడి పాదాల సన్నిదికి చేరింది. ఆమె జీవిత ప్రయాణం తపస్సు లాంటిది. మంచి బుద్దితో పని చేస్తూ జీవితాన్ని గడుపు అని నా తల్లి దీవించింది.’’
అంతిమ సంస్కారాలు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అంతిమ సంస్కారాలు పూర్తి అయ్యాయి. ప్రధాని మోదీ స్వయంగా తల్లి పాడిని మోసి తన తల్లి పట్ల ప్రేమను వ్యక్తం చేశారు. దేశానికి ప్రధానైనా తల్లి హీరాబెన్ అంతిమ సంస్కారాలలో ఆ దర్పం కనిపించలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా అంతిమ సంస్కారాలు ముగించారు.