Header Top logo

ఐ అమ్ మౌనిక ఫ్రం తెలంగాణ.. వాజ్ పేయి జీవితంపై స్పీచ్

మట్టిలో మాణిక్యంలా వెలుగుతుంది మౌనిక.. గిరిజన కుటుంబంలో పుట్టిన తాను ఇతరులతో పోటీ పడి అరుదైన అవకాశాన్ని స్వంతం చేజిక్కించుకుని శభ్బాష్ అనిపించుకుంది.

యూత్ పార్లమెంట్ లో ప్రసంగించి అందరి మన్ననలు పొందిన పోస్ట్ గ్రాడ్యువేషన్ చేస్తున్న గిరిపుత్రిక మౌనిక పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేధికగా..

‘‘ఐ అమ్ మౌనిక ఫ్రం తెలంగాణ’’

అంటూ గర్వంగా పరిచయం చేసుకుంది.

దేశ మాజీ ప్రధాని వాజ్ ఫేయి జీవితంపై అద్భుత ప్రసంగం చేసి ఔరా.. అనిపించుకుంది మౌనిక.

దివంగత ప్రధాని వాజ్ పేయి జీవితం యూత్ పార్లమెంట్ లో స్పీచ్ ఇవ్వడానికి దేశ వ్యాప్తంగా 25 మందిని ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో ఏడుగురికి భారత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రసంగించే అవకాశం దొరికింది.

ఆ ఏడుగురిలో తెలంగాణ ముద్దు బిడ్డ కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని పోచారంకు చెందిన కేతావత్ మౌనిక ఒక్కరే ఎంపిక కావడం విశేషం.

గిరిజన కుటుంబంలో పుట్టిన మౌనిక వాయ్ పేయి జీవితంపై దారాళంగా మాట్లాడిన తీరుకు అందరు ముగ్దులయ్యారు. మట్టిలో పుట్టిన మాణిక్యంలా మౌనికను అందరు అభినందిస్తున్నారు.

రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సొంత గ్రామమైన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని పోచారంకు చెందిన కేతావత్ నర్సింలు, సునీతల కుమార్తె మౌనిక.

కామారెడ్డి పట్టణం లోని అర్ కే పీజీ కాలేజీలో ఎంఎస్ డబ్ల్యు చదువుతోంది. తండ్రి నర్సింలు డీసీఎం డ్రైవర్ గా , తల్లి సునీత బీడీ కార్మికురాలిగా పని చేస్తున్నారు.

కామారెడ్డి పట్టణంలో ఉండి తమ ముగ్గురు పిల్లల్ని మౌనిక, ప్రవళిక, హసినిలను చదివిస్తున్నారు. మౌనిక ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, అదే కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రవళిక బిటెక్ ఫస్ట్ ఇయర్, హసిని ఇంటర్ చదువుతుంది.

మౌనిక  చదువుతో పాటు చురుకైన ప్రసంగాలతో కాలేజీలో అందరి మన్ననలను అందుకున్న మౌనికను కాలేజీ సీఈవో ఎం.జైపాల్ రెడ్డి ప్రోత్సహిం చారు. దేశవ్యాప్తంగా యూత్ పార్లమెంటుకు కళాశాల విద్యార్థులను ఎంపిక చేయడానికి కళాశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు పోటీలు నిర్వహించారు. అన్నింటా మౌనిక ప్రథమ స్థానంలో నిలిచింది.

యూత్ పార్లమెంటు కోసం…

దేశవ్యాప్తంగా యూ ర్లమెంటు ఎంపిక కోసం వివిధ దశల్లో వర్చువల్ పద్ధతిలో ప్రసంగ పోటీలు నిర్వహించారు.

మౌనికతోపాటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర బీహార్ నుంచి ఏడుగురికి అవకాశం కల్గింది. అందులో మౌనిక మూడోస్థానంలో మాట్లాడే అవకాశం దక్కించుకుంది.  

మొదట కళాశాల స్థాయిలో పోటీలు నిర్వహించగా మేకిన్ ఇండియా- మేడిన్ ఇండియాఅంశాన్ని తీసుకుని ఉపన్యసించి ప్రధమ స్థానంలో నిలిచింది. ఆ తరువాత జిల్లా స్థాయి. పోటీల్లో స్టార్టప్ ఇండియా స్టాండు ఇండియాఅనే అంశంపై ప్రసంగించి ప్రథమ స్థానం సాధించింది.

ఆ తరువాత రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా మొదటి స్థానం సాధించింది. తద్వారా పార్లమెంటులో మాట్లాడే అవకాశం లభించింది.

పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా..

యూత్ పార్లమెంటులో భాగంగా డిసెంబర్  25, 2022న పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిర్వ హించిన సమావేశంలో కేతావత్ మౌనిక మాట్లాడాలని నిర్వహకులు కోరారు. ఎంతో అనుభవం ఉన్నట్లుగా లేసి వేధిక వద్దకు వెళ్లి..

‘‘ఐ యామ్ మౌనిక ఫ్రం తెలంగాణ’’

 అంటూ ఇంగ్లీషులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టింది. ప్రధాని వాజ్ పేయి గురించి మౌనిక చేసిన ప్రసంగానికి అద్భుతమైన స్పందన వచ్చింది.

సాధారణ గిరిజన కుటుంబంలో పుట్టి పెరిగిన మౌనిక తల్లిదండ్రులు తమ చదువుల కోసం పడుతున్న శ్రమను చూసి కష్టపడి చదువుతూనే ప్రతిభకు కూడా పదును పెట్టుకుంటోంది.

ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థాయిలో నిలవాలన్న లక్ష్యంతో మౌనిక మామూలు చదువుతో పాటు ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో, ప్రసంగాలు చేస్తూ ఎంతోమంది మన్ననలు అందుకుంది.

యూత్ పార్లమెంటుకు ఎంపికై తన అద్భుత ప్రసంగంతో ఆకట్టుకున్న మౌనికను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, కళాశాల అధ్యాపకులు అభినందించారు.

జర్నలిస్ట్ సేపూరి వేణు గోెపాల్ చారి సాక్షిలో రాసిన కథనం..

కలెక్టక్ కావాలనే లక్ష్యంతో ముందుకు..

ఆపదలో ఉన్న పేదలకు సత్వరమే న్యాయం చేయాలంటే సివిల్ సర్వెంట్ ఒక్కటే అంటుంది కేతావత్ మౌనిక.

ఐఎఎస్ ఆఫీసర్ లు స్మిత సభర్వాల్, సుస్తీ దేశ్ ముఖ్ లను స్పూర్తిగా తీసుకున్నట్లు ఆమె చెబుతుంది.

చిన్నప్పటి నుంచి కష్ట పడి పెంచిన తన తల్లిదండ్రుల ప్రొత్సహంతో తాను ఐ ఎ ఎస్ అవుతానని నమ్మకంగా చెబుతుంది మౌనిక.

కాబోయే ఐ ఎ ఎస్ ఆఫీసర్ మౌనికకు ‘ వైడ్ న్యూస్ వెబ్  ’ తరపున అడ్వాన్స్ గా  ఆల్ ది బెస్ట్ చెబుదాం.

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking