Header Top logo

హనుమకొండకు న్యూ సూపర్ లగ్జరీ బస్సు

హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండకు కేటాయించబడిన నూతన సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్…

హనుమకొండ బస్ స్టాండ్ లో వరంగల్ రీజినల్ మేనేజర్ శ్రీలత ఆధ్వర్యంలో బస్సుకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి బస్సును ప్రారంభించారు.

అనంతరం సిబ్బందితో కలిసి బస్సులో ప్రయాణించారు….

ఉమ్మడి రాష్ట్రంలో అన్ని డిపోలు నష్టాల్లో నడిచాయని కానీ రాష్ట్రం సాధించినంక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అత్యంత ప్రామాణికంగా రవాణా వ్యవస్థను నడుపుతూ ప్రజలను సురక్షితంగా గమ్యానికి చేరవేస్తూ నష్టాల నుండి ఇప్పుడిప్పుడే బయట పడేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.

కేంద్రంలోని మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను ఆర్రాసు పాడుతుంటే…మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న సంస్థలను కాపాడడం జరుగుతుందని చీఫ్ అన్నారు…

మన ప్రజలు కూడా ఆర్.టి.సి ని చాలా గొప్పగా ఆదరిస్తున్నారని ఇంటి సంస్థగా భావించి సహకరిస్తున్నారని ఆయన అన్నారు…

ఆర్.టి.సి ని అద్భుతంగా ప్రక్షాళన చేసి వినూత్న రీతిలో కార్యక్రమాలు రూపొందించి ,ఎలక్ట్రానిక్ బస్సులను కూడా కొనుగోలు చేయడమే కాకుండా సాంకేతికతను అందిపుచ్చుకుని స్లీపర్ బస్సులను కూడా రూపొందించారని ఆయన అన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking